స్టార్ హీరో డైరెక్టర్..హీరోగా రిటైర్మెంట్!
రాక్ స్టార్ రణబీర్ కపూర్ బాలీవుడ్ లో ఎంత పెద్ద హీరో? అన్నది చెప్పాల్సిన పనిలేదు. రిషీ కపూర్ వారసత్వాన్ని కొనసాగిస్తోన్న అగ్ర నటుల్లో ఒకరు.
By: Srikanth Kontham | 30 Sept 2025 3:00 PM ISTరాక్ స్టార్ రణబీర్ కపూర్ బాలీవుడ్ లో ఎంత పెద్ద హీరో? అన్నది చెప్పాల్సిన పనిలేదు. రిషీ కపూర్ వారసత్వాన్ని కొనసాగిస్తోన్న అగ్ర నటుల్లో ఒకరు. `సావారియా`తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రణబీర్ కపూర్ కెరీర్ రెండు దశాబ్దాలగా దిగ్విజయంగా కొనసాగుతోంది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కలిగిన నటుడు. వందల కోట్లు వసూళ్లు తేగల సామర్ధ్యం గల హీరో. ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాంటి నటుడు దర్శకత్వం దిశగా ఆలోచన చేస్తున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ విషయాన్ని రణబీర్ స్వయంగా రివీల్ చేసాడు.
దర్శకుడిగా మారాలన్నది టార్గెట్!
నటుడిగానే కాకుండా దర్శకుడిగాను మారాలని ఉందని ...కెప్టెన్ కుర్చీ ఎక్కడాన్ని కూడా తాను ఓ లక్ష్యంగా భావించినట్లు తెలిపాడు. ఇటీవలే రచనకు సంబంధించిన వర్క్ షాప్స్ కూడా హాజరవుతున్నట్లు తెలిపాడు. వచ్చే రెండేళ్ల కాలంలో దర్శకుడిగా మారాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు. దీంతో రణబీర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నటుడిగా రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడా? అన్న సందేహాన్ని వ్యక్తం చేసారు. హీరోగా..డైరెక్టర్ గా రెండు పడవల ప్రయాణం అన్నది అంత సులభం కాదు. ఈ రకంగా ఇండస్ట్రీలో గొప్ప సక్సస్ సాధించింది కూడా ఎవరూ లేరు.
ఒకప్పుడు ఫేమస్ డైరెక్టర్లు అంతా:
హీరోగా ..దర్శకుడిగా రెండింటా వేరు వేరుగానే చాలా మంది కెరీర్ లో పీక్స్ చూసారు. ఎస్. జెసూర్య, గౌతమ్ మీనన్ ఒకప్పుడు దర్శకులుగా ఎంతో ఫేమస్ అయ్యారు. కానీ సూర్య దర్శకత్వం నుంచి నటుడిగా టర్న్ అయిన తర్వాత దర్శకుడిగా సినిమాలు చేయలేకపోతున్నారు. మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కాలని ఉన్నా? నటుడిగా బిజీ అవ్వడంతో సాధ్యపసడలేదు. గౌతమ్ మీనన్ కూడా ప్రేమ కథా చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కానీ నటుడిగా ప్రయాణం మొదలైన తర్వాత మళ్లీ దర్శకత్వం వైపు చూసింది లేదు. రాఘవ లారెన్స్ మల్టీట్యాలెంటెడ్. కొరియోగ్రాపర్ గా ఓ వెలుగు వెలిగిన అనంతరం నటుడయ్యాడు.
రెండు పడవల ప్రయాణం:
అటుపై దర్శకత్వంపైనా దృష్టి పెట్టాడు. నటుడిగా, దర్శకుడిగా రెండింటా పీక్ చూడాలనుకున్నాడు. కానీ అది సాధ్యప డలేదు. తన స్వీయా దర్శకత్వంలో సినిమాలు చేయడం తప్ప బయట హీరోలతో గ్రేట్ డైరెక్టర్ గా అవకాశాలు అందుకోలేకపోతున్నాడు. ప్రభుదేవా కూడా కొరియోగ్రాఫర్ గా, నటుడిగా చాలా కాలం రాణించాడు. అటుపై దర్శకుడిగా మారాడు. కానీ అక్కడ పూర్తి స్థాయిలో సక్సస్ కాలేకపోయాడు. మరి స్టార్ హీరోగా వెలిగిన రణబీర్ కపూర్ ఆ ఇమేజ్ ని వదిలేసి దర్శకుడిగా ప్రయాణం మొదలు పెడితే? చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి వాటికి రణబీర్ కపూర్ అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నడా? అన్నది చూడాలి.
