50రోజుల షూట్.. 100 కోట్ల బడ్జెట్ అదనం.. నిర్మాతకు బిగ్ షాక్!
సంజయ్ లీలా భన్సాలీ (SLB) ప్రతిష్టాత్మక చిత్రం 'లవ్ అండ్ వార్' గురించి ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ వేడెక్కిస్తోంది.
By: Sivaji Kontham | 26 Feb 2026 9:05 AM ISTసంజయ్ లీలా భన్సాలీ (SLB) ప్రతిష్టాత్మక చిత్రం `లవ్ అండ్ వార్` గురించి ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ వేడెక్కిస్తోంది. 2026 మోస్ట్ అవైటెడ్ చిత్రంగా చర్చల్లో నిలవాల్సిన ఈ సినిమా రిలీజ్ డిలే గురించి అభిమానుల్లో అంతకంతకు ఆందోళన పెరుగుతోంది.
షూటింగ్ జాప్యం వెనక అసలేం జరుగుతోంది? అంటూ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ గానే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే దీనికి కారణం భన్సాలీ పర్ఫెక్షనిజం. అతడు తన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకునే వ్యక్తి. ఆ క్రమంలోనే `లవ్ అండ్ వార్` షూటింగ్ షెడ్యూల్స్ తలకిందులయ్యాయని తెలుస్తోంది.
నిజానికి ఈ సినిమాను 120 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పటికే 175 రోజులు గడిచినా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో మరో 50 రోజుల షూటింగ్ ఇంకా మిగిలి ఉందని సమాచారం. ఇందులో మూడు భారీ పాటలు, ఒక కీలకమైన డ్రామా సీక్వెన్స్ చిత్రీకరించాల్సి ఉంది. సినిమాలో ఉండే భారీ యుద్ధ సన్నివేశాలు ఆశించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని కథనాలొస్తున్నాయి.
షూటింగ్ ఆలస్యం కావడంతో ఖర్చులు అమాంతం పెరిగాయి. నిజానికి మొదటి బడ్జెట్ అంచనా రూ.350 కోట్లు. కానీ ఆలస్యం కారణంగా ప్రస్తుత అంచనా సుమారు రూ.425 కోట్లు. ఇది భన్సాలీ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవనుంది.
అలాగే ఈ సినిమా కోసం హీరోలు నటుల రెమ్యూనరేషన్ వివరాలు పరిశీలిస్తే... రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ముందస్తు పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా పద్ధతికి మొగ్గు చూపారని తెలుస్తోంది. ఒకవేళ ముందస్తుగా పారితోషికం అందుకుంటే, బడ్జెట్ రూ.500 కోట్లు దాటేదని అంచనా వేస్తున్నారు.
బడ్జెట్ పెరిగినా భన్సాలీకి బిజినెస్ పరంగా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. లవ్ అండ్ వార్ ఓటీటీ హక్కులు దాదాపు రూ.130 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. మ్యూజిక్ , శాటిలైట్ రైట్స్ రూపంలో మరో 70-80 కోట్లు వచ్చాయి. అంటే సినిమా థియేటర్లలోకి రాకముందే సుమారు రూ.200 కోట్లకు పైగా రికవరీ జరిగింది.
షూటింగ్ ఆలస్యం వల్ల విడుదల తేదీ కూడా మారింది. తొలుత 2025 క్రిస్మస్‌కు రిలీజ్ ఉంటుందని భావించినా తర్వాత 2026కి మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2026 చివరిలో (డిసెంబర్) లేదా 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. రణబీర్ కపూర్ నటించిన `రామాయణ-1 అక్టోబర్ 2026లో విడుదలకు వస్తే, ఆ తర్వాతే ఇది వచ్చే ఛాన్స్ ఉంది. `సంగం` వంటి క్లాసిక్ తరహాలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని యుద్ధ నేపథ్యంలో భన్సాలీ చూపిస్తున్నారు. షూటింగ్ ఆలస్యమైనా ఆయన అందించే విజువల్ ట్రీట్ అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
