ఆ సినిమాలో హీరో-హీరోయిన్ రియల్ లవ్ స్టోరీ!
బాలీవుడ్ జోడీ రణబీర్ కపూర్-అలియాభట్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్` చిత్రాన్ని ఎంత ప్రతి ష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో? చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 26 Dec 2025 8:30 PM ISTబాలీవుడ్ జోడీ రణబీర్ కపూర్-అలియాభట్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్` చిత్రాన్ని ఎంత ప్రతి ష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో? చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని కూడా బన్సాలీ తనదైన మార్క్ లో చెక్కుతు న్నారు. ఏడాది క్రితమే సెట్స్ కు వెళ్లినా ఇంకా సెట్స్ లోనే ఉంది? అంటే బన్సాలీ ఎంతగా చెక్కుతున్నారో? అర్దం చేసుకోవచ్చు. `లవ్ అండ్ వార్` కూడా మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీ గా హైలైట్ అవుతుంది. ఇదే కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అందుకు ఆద్యుడు విక్కీ కౌశల్ అవ్వొచ్చు. ఇందులో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇదొక ముక్కోణపు లవ్ స్టోరీగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. రణబీర్ కపూర్-విక్కీ కౌశల్ పాత్రల్లో తగ్గాఫ్ వార్ కనిపిస్తోంది. ఇద్దరి మధ్యన అలియాభట్ పాత్ర కూడా అంతే రక్తి కట్టించేలా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా అందింది. ఈ కథకు మూలం రణబీర్ కపూర్-అలియాభట్ రియల్ లవ్ స్టోరీ అని కూడా ఓ హింట్ అందింది. ఇద్దరు డీప్ లవ్ లో ఉన్నప్పుడు తలెత్తిన కొన్ని సమస్యల్ని బన్సాలీ మెయిన్ థీమ్ గా తీసుకునే కథ అల్లినట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అదే నిజమతై? కథ మరింత రసవత్తవరంగా మారడం ఖాయం. రణబీర్ కపూర్-అలియాభట్ మధ్య లవ్ ఎలా ప్రారంభమైందో? తెలిసిందే.`సవారియా`లో రణబీర్‌ను చూసినప్పుడే అలియాభట్ అతడి ప్రేమలో పడిపోయింది. అప్పటికి అలియాభట్ వయసు14 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచి రణబీర్ కపూర్ ఏ సినిమాలో నటించినా తప్పక చూసేది. కరణ్ జోహార్ సహాకారంతో `రాక్‌స్టార్` సినిమా కార్యక్రమంలో రణబీర్‌తో మాట్లాడించారు. ఆ సమయంలో ఎంత ఇష్టపడుతున్నావో చెప్పు? అంటూ రణబీర్ ముందే మాట్లాడించాడు. దీంతో రణబీర్ అలియా భట్ గుక్క తిప్పకుండా ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది.
ఆ మాటలకు రణబీర్ యా దట్స్ వెరీ నైస్ అలియా అని రణబీర్ రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులు అయ్యారు. అలా మొదలైన స్నేహం ముదరడంతో కొన్నాళ్లకు రణబీర్‌కి కూడా అలియాపై ప్రేమ మొదలైంది. అలా కొంత కాలం ప్రేమించుకున్నారు. ఈ విషయాలన్నింటిని సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్లో హైలైట్ చేస్తున్నారు? అన్నది తాజా అప్ డేట్. రణబీర్ కి సంబంధించి ఇంకా ఇన్ డెప్త్ కి వెళ్తే? చాలా ఎఫైర్లు తీయాల్సి ఉంటుంది. అలాయాభట్ తో ప్రేమకు ముందే? రణబీర్ కపూర్ దీపికా పదుకొణే రిలేషన్ షిప్ బ్రేక్ అయింది. అంతకు ముందు కత్రీనాకైఫ్ తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
