Begin typing your search above and press return to search.

స్టార్‌ కపుల్‌ డ్రీమ్‌ హౌస్‌ రెడీ.. ఖరీదు ఎంతో తెలుసా?

బాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ స్టార్‌ కపుల్‌ రణబీర్ కపూర్‌, ఆలియా భట్‌ల డ్రీమ్‌ హౌస్‌ రెడీ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

By:  Ramesh Palla   |   1 Aug 2025 6:48 PM IST
స్టార్‌ కపుల్‌ డ్రీమ్‌ హౌస్‌ రెడీ.. ఖరీదు ఎంతో తెలుసా?
X

బాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ స్టార్‌ కపుల్‌ రణబీర్ కపూర్‌, ఆలియా భట్‌ల డ్రీమ్‌ హౌస్‌ రెడీ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఈ ఇల్లు గురించిన వార్తలు బాలీవుడ్‌ మీడియాలో తెగ వినిపించాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీల ఇళ్ల గురించి ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. వందల కోట్లు ఖర్చు చేసి మరీ స్టార్స్ తమ ఇళ్ల నిర్మాణం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ ఇల్లు మన్నత్‌ ఖరీదు అత్యంత ఎక్కువగా ఉంటుంది. పాతికేళ్ల క్రితం షారుఖ్‌ ఖాన్‌ ఆ ఇంటిని దాదాపుగా రూ.15 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఇంటి ఖరీదు దాదాపుగా రూ.250 కోట్లుగా ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచన. అంతకు మించి కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు.

షారుఖ్‌ ఖాన్‌ మన్నత్‌ను మించేలా రణబీర్ కపూర్‌ ఇల్లు

మన్నత్‌ స్థాయి ఇంటి నిర్మాణం మరే బాలీవుడ్‌ స్టార్‌కి సాధ్యం కాదని అంతా భావించారు. కానీ మెల్ల మెల్లగా మన్నత్‌ను మించిన ఇళ్ల నిర్మాణం జరుగుతున్నాయి. రణబీర్‌ కపూర్‌, ఆలియా దంపతులు దాదాపుగా మన్నత్‌ కి సమానమైన స్థాయిలో రూ.250 కోట్లు ఖర్చు చేసి తమ కలల సౌదం ను నిర్మించుకున్నారు. బాంద్రాలోని అత్యంత ఖరీదైన ఏరియాలో ఈ ఇంటి నిర్మాణం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా నిర్మాణం జరుగుతున్న ఈ ఇల్లు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల రణబీర్‌ కపూర్ తల్లి అయిన నీతూ కపూర్‌, ఇంకా ఆలియా భట్‌లు ఇంటిని సందర్శించారు. అంతే కాకుండా ఆ ఇంటి నిర్మాణంలో మొదటి నుంచి పని చేస్తూ వస్తున్న వారికి భోజనాలు పెట్టించారని తెలుస్తోంది.

కృష్ణ రాజ్‌ కపూర్‌ జ్ఞాపకార్థం

కార్మికులకు విడ్కోలు పలకడంలో భాగంగా వారికి భోజనాలు పెట్టించారనే వార్తలు వస్తున్నాయి. అంటే ఇల్లు నిర్మాణం ముగింపు దశకు వచ్చింది. అతి త్వరలోనే గృహ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయని స్థానిక మీడియా వారు కూడా చెబుతున్నారు. ఈ ఇంటిని రణబీర్‌ కపూర్‌ నానమ్మ అయిన కృష్ణ రాజ్‌ కపూర్‌ జ్ఞాపకార్థం నిర్మిస్తున్నట్లు ఫ్యామిలీ మెంబర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ ఆరు అంతస్తుల భారీ భవనం బాంద్రాలో ప్రస్తుతం సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. రణబీర్‌ కపూర్‌ ఈ ఇంటి నిర్మాణం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, తమ కుటుంబ చరిత్ర ఇంట్లో కనిపించే విధంగా చర్యలు తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ ఇంటి గురించి బాలీవుడ్‌లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

రామాయణలో రణబీర్‌ కపూర్‌

రణబీర్‌ కపూర్‌ సినిమాల విషయానికి వస్తే యానిమల్‌ సినిమా తర్వాత బాక్సాఫీస్ వద్ద ఈయన క్రేజ్‌ మరింతగా పెరిగింది. ఆయన నుంచి రాబోతున్న ప్రతి సినిమా వెయ్యి కోట్ల రేంజ్‌లో ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. యానిమల్‌ సినిమాకు పూర్తి విరుద్దమైన రామాయణ సినిమాలో ప్రస్తుతం ఈయన నటిస్తున్న విషయం తెల్సిందే. రాముడిగా రణబీర్‌ కపూర్‌ నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ టీజర్‌కి మంచి స్పందన దక్కింది. అంతే కాకుండా సినిమా కాస్టింగ్‌ కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. యశ్‌ ఈ సినిమాలో రావణుడిగా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ రామాయణ మొదటి పార్ట్‌ విడుదల కాబోతుంది. రెండు లేదా మూడు పార్ట్‌లుగా సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం అందుతోంది.