Begin typing your search above and press return to search.

విజయ్, రష్మిక పెళ్లి పోస్టర్.. ఇంత కథ ఉందా?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ అంటేనే అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్.

By:  M Prashanth   |   2 March 2026 11:57 AM IST
విజయ్, రష్మిక పెళ్లి పోస్టర్.. ఇంత కథ ఉందా?
X

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ అంటేనే అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్. సిల్వర్ స్క్రీన్ పై హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వారిద్దరూ ఇప్పుడు రియల్ లైఫ్ లో వివాహ బంధంతో ఒక్కటవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే సమయంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం రణబాలి నుంచి విడుదలైన వెడ్డింగ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

అయితే ఆ పోస్టర్ కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే తీసిందని అనుకుంటే పొరపాటే అంటున్నారు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. ఆ ఫోటో వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్.. నెట్టింట వైరల్ గా మారింది. రాహుల్ సాంకృత్యాన్ ఎక్స్ప్లనేషన్ కూడా ఆకట్టుకుంటోంది.

రాహుల్ కు చిన్నప్పటి నుంచే పాతకాలపు ఫోటోలు అంటే ఎంతో ఇష్టమట. తమ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు కెమెరా ముందు నిలబడిన విధానం తనను బాగా ఆకట్టుకుంటుందని చెప్పారు. ఆ కాలం ఫోటోల్లో ఎలాంటి పోజులు, ఆర్టిఫిషియల్ స్మైల్స్ ఉండేవి కావని అన్నారు. కేవలం నేచురాలిటీ, నిజాయితీ మాత్రమే కనిపించేదని తెలిపారు.

అదే ఫీల్ ను రణబాలి వరల్డ్ లో తీసుకురావాలనుకున్నానని చెప్పారు. ఒక రోజు షూటింగ్ సమయంలో విజయ్, రష్మిక పెళ్లి దుస్తుల్లో సెట్స్‌ లోకి అడుగుపెట్టగానే వాతావరణమే మారిపోయిందట. వారు నటుల్లా కాకుండా ఆ కాలానికి చెందిన నిజమైన వధూవరుల్లా కనిపించారని చెప్పారు. వెంటనే భారీ లైటింగ్‌లు, స్టైలిష్ సెటప్స్ పక్కనపెట్టి, సింపుల్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఎలాంటి పోజులు లేకుండా పిక్ తీసినట్లు చెప్పారు.

"ఆ ఫోటో చూస్తే ఇది పోస్టర్ కాదు. ఓ మెమరీ లాంటిది. వారి గత జన్మ పెళ్లి ఫోటోలా అనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా అదే సమయంలో నిజ జీవితంలోనూ వారు పెళ్లి చేసుకోవడం ప్రత్యేకంగా అనిపించింది. కొన్ని సందర్భాల్లో రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఒకదానితో ఒకటి ముడిపడిపోతాయి" అంటూ రాహుల్ రాసుకొచ్చారు.

ఇక రణబాలి సినిమా విషయానికి వస్తే.. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. విజయ్ రణబాలిగా కనిపించనుండగా, రష్మిక జయమ్మ పాత్రలో నటిస్తున్నారు. భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే విజయ్- రష్మిక కాంబినేషన్‌ కు ఇది హ్యాట్రిక్ మూవీ కావడం మరో విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి నటించిన గోతాగోవిందం బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. డియర్ కామ్రేడ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత విజయ్-రష్మిక నుంచి వస్తున్న తొలి చిత్రం కావడంతో రణబాలిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన వెడ్డింగ్ పోస్టర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 11న మూవీ థియేటర్లలోకి రానుంది.