విజయ్‌కు కావాల్సింది హిట్ మాత్రమే కాదు!
టాలీవుడ్‌లో కొంతమంది హీరోలకు ఒక సినిమా సక్సెస్ కంటే.. ఆ సక్సెస్ తర్వాత ఏర్పడే మార్కెట్ ఇంపాక్ట్ మరింత కీలకంగా మారుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 26 Aug 2026 4:00 PM ISTటాలీవుడ్‌లో కొంతమంది హీరోలకు ఒక సినిమా సక్సెస్ కంటే.. ఆ సక్సెస్ తర్వాత ఏర్పడే మార్కెట్ ఇంపాక్ట్ మరింత కీలకంగా మారుతుంది. అలాంటి దశలోనే ఇప్పుడు విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న విజయ్.. ఆ తర్వాత వరుస సినిమాలతో అదే స్థాయి బాక్సాఫీస్ ప్రభావాన్ని కొనసాగించలేకపోయారు. దీంతో ఇప్పుడు రాబోయే రణబాలిపై కేవలం సినిమా రిజల్ట్ కోసమే కాకుండా, విజయ్ మార్కెట్ మళ్లీ ఏ స్థాయికి వెళ్తుందనే ఆసక్తి నెలకొంది.
ఇక్కడ రణబాలి సినిమాకి ఎదురవుతున్న అసలు ఛాలెంజ్ కలెక్షన్లను సాధించడం మాత్రమే కాదు. విజయ్ సినిమాకు గతంలో ఉన్న ఓపెనింగ్ క్రేజ్, థియేట్రికల్ డిమాండ్, బిజినెస్ వాల్యూ మళ్లీ పెరగడం కూడా అంతే ముఖ్యం. ఒక సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం టెంపరరీ సక్సెస్ ను ఇవ్వొచ్చు. కానీ ఆ సినిమా తర్వాత హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై మార్కెట్‌లో ఏర్పడే నమ్మకమే అసలు స్టార్ మార్కెట్‌కు కొలమానంగా చూస్తారు. ఈ విషయంలో రణబాలి విజయ్‌కు కీలకమైన పరీక్షగా మారనుంది.
ఈ సినిమాకు మరో ఆసక్తికర అంశం విజయ్- రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ట్యాక్సీవాలా విజయ్ కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. పరిమిత వనరులతో విభిన్నమైన కథను చెప్పిన ఆ సినిమా.. రాహుల్‌లోని కొత్తదనం, విజయ్‌లోని ఎనర్జీకి మంచి కాంబినేషన్ ఉందనే నమ్మకాన్ని కలిగించింది. ఇప్పుడదే కాంబినేషన్ మరింత భారీ స్థాయిలో, భిన్నమైన నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తిని పెంచుతోంది.
అయితే ఈసారి కేవలం కాంబినేషన్ మీదే సినిమా ఆధారపడే పరిస్థితి లేదు. కథ, క్యారెక్టర్, విజువల్ స్కేల్, పీరియడ్ నేపథ్యం, ఎమోషన్.. ఇవన్నీ కలిసి ఆడియన్స్ కు థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా విజయ్‌ను మరోసారి భారీ ఓపెనింగ్స్ తీసుకురాగల స్టార్‌గా నిలబెట్టాలంటే సినిమా మొదటి రెస్పాన్స్ తో పాటు లాంగ్ రన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే రణబాలి విజయ్‌కు మరో హిట్‌గా మిగిలిపోతుందా? లేక అతని మార్కెట్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే సినిమాగా మారుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. సినిమా రిజల్ట్ తో పాటు దాని తర్వాత విజయ్‌పై ఏర్పడే బిజినెస్ నమ్మకమే ఈ జర్నీలో అసలైన సక్సెస్ గా నిలవనుంది.
