Begin typing your search above and press return to search.

పిల్లలు చూడాలంటున్నాడు.. వైలెంట్ అంటున్నాడు..

విజయ్ దేవరకొండ రణబలి ట్రైలర్ లాంచ్ వేదికగా తన సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు.

By:  M Prashanth   |   8 Oct 2026 8:23 PM IST
పిల్లలు చూడాలంటున్నాడు.. వైలెంట్ అంటున్నాడు..
X

విజయ్ దేవరకొండ రణబలి ట్రైలర్ లాంచ్ వేదికగా తన సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. మన చరిత్ర, మన డిఎన్ఏ ఏంటో నేటి తరానికి తెలియాలని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఈ సినిమాను చూపించాలని కోరాడు. అయితే అదే ఊపులో ఈ కథను కొంచెం వైలెంట్ లెన్స్ నుంచి చెప్పామని, సెన్సార్ సర్టిఫికెట్ ను బట్టి పిల్లలను తీసుకురావాలని ఒక చిన్న కండిషన్ కూడా పెట్టాడు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా దసరా లాంటి పండగ సీజన్ లో థియేటర్లకు వచ్చేది ఫ్యామిలీ ఆడియన్సే. వాళ్ళు ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. పిల్లలతో కలిసి హాయిగా నవ్వుకునే కథలకే హాలిడేస్ లో పెద్దపీట వేస్తారు. ఇలాంటి టైమ్ లో పూర్తిగా రక్తపాతం, కత్తులు, నరుక్కునే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న ఒక పీరియాడిక్ డ్రామాను ఫెస్టివల్ బరిలో రిలీజ్ చేయడం బాక్సాఫీస్ దగ్గర పెద్ద రిస్క్ అనే చెప్పాలి.

ట్రైలర్ చూస్తే అందులో విజయ్ చెప్పినట్లే వయొలెన్స్ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిటిష్ వాళ్ళ మీద కోపం, మహా కరువు బ్యాక్ డ్రాప్ కావడంతో సినిమా టోన్ అంతా చాలా సీరియస్ గా సాగుతుంది. తలలు నరకడం, నెత్తురు పారడం లాంటి మాస్ ఎలిమెంట్స్ యూత్ కు విపరీతంగా కనెక్ట్ అవుతాయి. కానీ కేవలం ఆ యాక్షన్ సీన్స్ మాత్రమే హైలైట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం కష్టమే.

సరిగ్గా ఇక్కడే డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఎమోషన్ వర్కౌట్ అవ్వాల్సి ఉంటుంది. విజయ్ చెబుతున్నట్లు మన పూర్వీకుల చరిత్ర, ఆ పోరాటం వెనుక ఉన్న ఆవేదన ఫ్యామిలీస్ కు కనెక్ట్ అయితే వయొలెన్స్ పెద్ద అడ్డంకి కాదు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లోనూ యాక్షన్ ఉన్నా ఎమోషన్ వల్ల అన్ని వర్గాల వాళ్ళు చూశారు. రణబలిలో కూడా ఆ కరువు తాలూకు పెయిన్ పండితే యాక్షన్ ను కూడా జనాలు ఓన్ చేసుకుంటారు.

విజయ్ తన స్పీచ్ లో సెన్సార్ సర్టిఫికెట్ గురించి ప్రస్తావించడం కూడా మంచిదే. ముందే ఎలాంటి దాపరికం లేకుండా సినిమాలో వయొలెన్స్ ఉందని చెప్పేయడం వల్ల ఆడియన్స్ మైండ్ సెట్ కూడా దానికి తగ్గట్లుగా ప్రిపేర్ అవుతుంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ఫ్యామిలీస్ ను రమ్మని పిలుస్తున్నాడు. అయితే ఏ సర్టిఫికెట్ వస్తుందనేది ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ మీద గట్టి ప్రభావం చూపిస్తుంది.

ఒక పక్క మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించే యాక్షన్, మరో పక్క చరిత్రను గుర్తుచేసే ఎమోషన్.. ఈ రెండింటిని మేకర్స్ ఏ స్థాయిలో బ్యాలెన్స్ చేశారన్నదే అసలు పాయింట్. పండగ సీజన్ లో యూత్ తో పాటు ఫ్యామిలీస్ కూడా ఈ హిస్టారికల్ డ్రామాకు కనెక్ట్ అయితే విజయ్ దేవరకొండ దసరా బరిలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. చూడాలి మరి కంటెంట్ ఏ స్థాయిలో ఉంటుందో.