'రణబాలి'కి పెళ్లి లక్ కలిసి వచ్చేనా?
రణబాలి సినిమాతో విజయ్ దేవరకొండకు హిట్ పడటం మాత్రమే కాకుండా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కి స్టార్స్ నుంచి పిలుపు రావడం కన్ఫర్మ్ అని విశ్లేషకులు అంటున్నారు.
By: Ramesh Palla | 17 Sept 2026 12:03 PM ISTవిజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో పాటు, తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'రణబాలి'. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించడంతో మరింతగా హైప్ పెరిగింది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ తర్వాత వస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటి వరకు రాహుల్ నుంచి వచ్చిన సినిమాలు దేనికి అదే అన్నట్లుగా విభిన్నంగా, ఆకట్టుకునే విధంగా, కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించాయి. అందుకే రణబాలి సినిమా పై మొదటి నుంచి ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు, ప్రేక్షకులు అంచనాలు పెంచుకుంటూ వచ్చారు. ఇటీవల వచ్చిన టీజర్, వీడియోలు, ఫోటోలు సినిమా పై అంచనాలు మరింత పెంచాయి అనడంలో సందేహం లేదు. రణబాలి ఒక రెగ్యులర్ మూవీ అనుకున్న వారికి తాజా గ్లిమ్స్‌తో దర్శకుడు షాక్ ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ రణబాలి మూవీ...
'రణబాలి' ఒక పీరియాడిక్ మూవీ మాత్రమే కాకుండా ఒక భారీ యాక్షన్ అడ్వంచర్ మూవీ అని గ్లిమ్స్‌ను చూస్తే అర్థం అవుతుంది. స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో వందలాది సినిమాలు వచ్చాయి, ఇందులో కొత్తగా ఏం ఉంటుందా అని ఎదురు చూసిన వారికి గ్లిమ్స్‌లో చూపించిన కంటెంట్ సర్‌ప్రైజింగ్‌గా అనిపించక మానదు. ఇక విజయ్ దేవరకొండ లుక్, రష్మిక మందన్న లుక్‌తో దర్శకుడు సినిమా స్థాయిని పెంచాడు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా కాలం అయింది. ఆయన నుంచి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్‌ను అభిమానులు ఆశిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఆ విజయాన్ని సొంతం చేసుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు, రౌడీ ఫ్యాన్స్ సైతం రణబాలి హిట్ పై ఆశలు పెట్టుకున్నారు. పెళ్లి సెంటిమెంట్ విజయ్‌దేవరకొండకు కలిసి వస్తుందని, రణబాలి హిట్ కొడుతుందని కొందరు భావిస్తున్నారు.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో...
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత మొదటి సారి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కలిసి రావడం మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొదటి సినిమా కూడా ఇదే. కనుక ఈ మధ్య కాలంలో కొందరు హీరోలకు పెళ్లి తర్వాత వచ్చిన సినిమాలు హిట్ కావడంతో విజయ్ దేవరకొండకు సైతం పెళ్లి లక్ కలిసి వచ్చి రణబాలి హిట్ అవుతుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. లక్ కలిసి రావడంతో పాటు, రాహుల్ ప్రతిభ, విజయ్ దేవరకొండ కష్టం, రష్మిక మందన్న ఎఫర్ట్ ఇలా అన్ని కలిసి వచ్చి రణబాలి సినిమా హిట్‌గా నిలుస్తుంది అనే విశ్వాసంను ఇండస్ట్రీ వర్గాల వారు సైతం వ్యక్తం చేస్తున్నారు. రణబాలి సినిమాతో విజయ్ దేవరకొండకు హిట్ పడటం మాత్రమే కాకుండా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కి స్టార్స్ నుంచి పిలుపు రావడం కన్ఫర్మ్ అని విశ్లేషకులు అంటున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి...
తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో అక్టోబర్ 16, 2026న దసరా కానుకగా విడుదల కానున్న 'రణబాలి' మూవీకి భారీ బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాను ఏకంగా 130 రోజుల పాటు చిత్రీకరించినట్లు దర్శకుడు ఇటీవల పేర్కొన్నాడు. రణబాలి కోసం విజయ్ దేవరకొండ ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా కష్టపడ్డాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, చాలా కష్టపడ్డట్లు గా చెబుతున్నారు.
ఈ సినిమాకు అజయ్-అతుల్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే వచ్చిన ఒక పాటకు మంచి స్పందన వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమా వెయిట్‌ను మరింతగా ఈ సంగీత దర్శకులు పెంచే విధంగా రీ రికార్డింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేరకొండకు పెళ్లి తర్వాత రాబోతున్న ఈ సినిమా హిట్ అయితే రష్మిక మందన్న మరింత లక్కీ చామ్ అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
