రణబలి.. ట్రైలర్ ఇంత పెద్దగా ఉందంటే..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హిట్ పెయిర్ మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
By: M Prashanth | 7 Oct 2026 10:22 PM ISTవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హిట్ పెయిర్ మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబలి అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆడియన్స్ లో ఒక రకమైన క్యూరియాసిటీ నడుస్తోంది. ఇప్పుడు ఆ హైప్ ను మరింత పెంచేలా మేకర్స్ క్రేజీ అప్డేట్ వదిలారు.
ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న రణబలి థియేట్రికల్ ట్రైలర్ కు టైమ్ లాక్ అయింది. అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ట్రైలర్ ను డ్రాప్ చేయనున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే ఈ కట్ రన్ టైమ్ ఏకంగా 3 నిమిషాల 47 సెకన్లు ఉండబోతోంది. ఒక సినిమా ట్రైలర్ కు ఈ రేంజ్ రన్ టైమ్ ఇచ్చారంటే దర్శకుడు క్రియేట్ చేసిన ప్రపంచం ఎంత భారీగా ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
ఈ ట్రైలర్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్లకు సంబంధించిన కొత్త కోణాలతో పాటు అసలు కథలోని కాన్ఫ్లిక్ట్ ఏంటనేది రివీల్ చేసే ఛాన్స్ ఉంది. లేటెస్ట్ గా బయటకు వచ్చిన ఒక పిక్ లో యుద్దభూమిలో ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని రౌద్ర రూపంలో ఉన్న హీరో లుక్ చూస్తుంటే సినిమా ఇంటెన్సిటీ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది. అలాగే ఈ లాంగ్ ట్రైలర్ లో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ చాలానే ప్లాన్ చేశారని ఇన్ సైడ్ టాక్.
సినిమా రిలీజ్ కు ముందు టీమ్ చేస్తున్న ప్రమోషన్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. అజయ్ అతుల్ మ్యూజిక్ తో పాటలు ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయాయి. టీమ్ వదిలిన డాక్యుమెంటరీ సిరీస్ వల్ల ఈ ప్రాజెక్ట్ వెనుక పడిన కష్టం జనాలకు తెలిసింది. రీసెంట్ గా విజయ్, రష్మిక కలిసి చేసిన పాడ్ కాస్ట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవ్వడం సినిమా బజ్ కు బాగా హెల్ప్ అయింది.
ఈ పీరియడ్ డ్రామా స్కేల్ ను పెంచేలా హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూను దించడం ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. నిర్మాణ విలువల పరంగా చూసుకుంటే మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు టీ సిరీస్ లాంటి భారీ సంస్థలు ఈ ప్రాజెక్ట్ ను భారీగా హైలెట్ చేస్తున్నాయి. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండటంతో విజువల్స్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదు.
ఇప్పుడు అందరి ఫోకస్ రేపు రాబోయే ట్రైలర్ మీదే ఉంది. ఒక రూటెడ్ పీరియడ్ స్టోరీని రాహుల్ సంకృత్యాన్ స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేశాడనేది రేపు తెలియనుంది. దాదాపు నాలుగు నిమిషాల పాటు సాగే ఈ కట్ గనక యూత్ కు కనెక్ట్ అయితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రణబలికి అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం పక్కా.
