Begin typing your search above and press return to search.

కొమరం భీమ్‌లా మన తెలుగు హీరో `రణబాలి`.. మైత్రి నిర్మాత‌లు!

విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ `రణబాలి` వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

By:  Sivaji Kontham   |   13 Oct 2026 11:44 PM IST
కొమరం భీమ్‌లా మన తెలుగు హీరో `రణబాలి`.. మైత్రి నిర్మాత‌లు!
X

విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ `రణబాలి` వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రశ్మిక మందన్న ఈ చిత్రంలో క‌థానాయిక‌. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలో ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. రణబాలి లాంటి సినిమాను నిర్మించే అవకాశం అరుదుగా వస్తుంటుందని తెలిపారు. తమకు ఎంతో సంతృప్తినిచ్చిన ఈ గొప్ప కథను తమ ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ రాహుల్ కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. విజయ్ - రశ్మిక వివాహం తర్వాత మొదటిసారిగా నటిస్తున్న సినిమా తమ బ్యానర్ లోనే వస్తుండటం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ చిత్రానికి పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ.. అక్టోబర్ 16న థియేటర్లకు వచ్చి సినిమాను విజయవంతం చేయాలని కోరారు.

ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ.. రణబాలి సినిమాను ప్రతి ఒక్కరూ ఎందుకు చూడాలంటే ఇది మన కథ.. మన కల్చర్ తో రూపుదిద్దుకున్న చిత్రం అని వెల్లడించారు. మనకు తెలియని చరిత్రను, మన తెలుగు వీరుడి గొప్పదనాన్ని ఈ సినిమా ద్వారా చూపిస్తున్నట్లు తెలిపారు. ఒక అల్లూరి సీతారామరాజు.. ఒక కొమరం భీమ్‌లా మన తెలుగు హీరో రణబాలి నిలవనున్నాడని... ఆ సినిమాల రేంజ్ లోనే ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సినిమా ప్రత్యేకతలను వివరిస్తూ... జానపదంతో మొదలయ్యే ఈ చిత్రం అదే జానపదంతో ముగుస్తుందని రవిశంకర్ తెలిపారు. ఇందులో హీరో విజయ్ దేవరకొండ - హీరోయిన్ రశ్మిక మధ్య వచ్చే డ్రామా... వారి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు. అంతేకాకుండా సినిమాలో ఇరుముడిలాంటి ఒక డివైన్ ఎలిమెంట్ కూడా ఉందని.. ఇవన్నీ కలిసి రణబాలిని ప్రేక్షకులకు అత్యంత నచ్చేలా చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

చివరగా తమ హీరో విజయ్ దేవరకొండ పడిన కష్టానికి ఈ సినిమాతో పెద్ద హిట్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు రవిశంకర్ పేర్కొన్నారు. రశ్మికతో తమ సంస్థకు ఇప్పటికే పాన్ ఇండియా హిట్లు ఉన్నాయని గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ వీరిద్దరితో మళ్లీ మళ్లీ సినిమాలు చేసే అవకాశం రావాలని ఆశిస్తున్నట్లు ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.