AI కాదని డైరెక్టర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి..?
లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్ రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ చూసిన నెటిజన్లు ఇది ఏఐతో చేసిందని కామెంట్ చేస్తున్నారు.
By: Ramesh Boddu | 27 Jan 2026 11:34 AM ISTAI రావడం వల్ల ఏది రియల్ ఏది ఫేక్ అన్నది తెలుసుకోవడం కాస్త కష్టంగా మారింది. ఐతే సినీ మేకింగ్ లో ఏఐ వాడకం అన్నది స్పెషల్ గా మారింది. టెక్నికల్ గా సినిమాను హై స్టాండర్డ్ లో చేసేందుకు AI ని వాడుతున్నారు. ఆమధ్య స్పిరిట్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ AIని వాడి సౌండ్ ట్రాక్ వదిలాడు. అది ఏఐ తో చేసిందని తెలిసి రెబల్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఏఐ ని మేకర్స్ అఫీషియల్ గా వాడితే ఎలా ఉంటుందో స్పిరిట్ సౌండ్ ట్రాక్ చూస్తే అర్ధమవుతుంది.
విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్..
ఐతే ఇదేవిధంగా కొన్ని సినిమాల టీజర్ క్లిప్స్ చూసి అవి కూడా AI తో చేసినవే అంటూ కామెంట్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్ రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ చూసిన నెటిజన్లు ఇది ఏఐతో చేసిందని కామెంట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా రణబాలి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
బిఫోర్ ఇండిపెండ్స్ తెల్లవాళ్ల మీద పోరాటం చేసిన కథా నేపథ్యంతో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా గ్లింప్స్ ని ఏఐ తో చేశారంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. ఐతే దీనిపై డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ క్లారిటీ ఇచ్చారు. ఆ గ్లింప్స్ ఏఐ తో చేసింది కాదని తన సోషల్ మీడియాలో ఆన్సర్ ఇచ్చారు. కొన్ని నెలలు కష్టపడి ఆ టీజర్ రెడీ చేశామని అన్నారు.
నానితో శ్యామ్ సింగ్ రాయ్ తర్వాత రాహుల్..
నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉన్నా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం రణబాలి గ్లింప్స్ చూసి సూపర్ హ్యాపీగా ఉన్నారు. సైలెంట్ గా రిపబ్లిక్ డే నాడు ఒక అదిరిపోయే టీజర్ తమ హీరో నుంచి వచ్చిందని ఖుషి అవుతున్నారు. నానితో శ్యామ్ సింగ్ రాయ్ సినిమా తర్వాత రాహుల్ ఆఫ్టర్ గ్యాప్ చేస్తున్న సినిమా ఇది. తప్పకుండా సినిమా గ్లింప్స్ చూస్తేనే ఇదేదో పెద్ద రేంజ్ సినిమా అనిపిస్తుంది. గ్లింప్స్ రిలీజ్ తోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
కింగ్ డం తో ఊరించి నిరాశపరిచిన విజయ్ దేవరకొండ నెక్స్ట్ రౌడీ జనార్ధన్ తో రాబోతున్నాడు. మరోపక్క రాహుల్ తో కలిసి రణబాలితో వస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో విజయ్ దేవరకొండ తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. రణబాలి టీజర్ తో మళ్లీ రౌడీ ఫ్యాన్స్ యాక్టివ్ అయ్యారు. ఐతే ఈ టీజర్ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేసే టైం లో ఇది ఏఐ తో చేసిందని వస్తున్న కామెంట్స్ కి కాస్త డిస్టర్బ్ అవుతున్నారు. ఐతే డైరెక్టర్ క్లారిటీతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
