రణబాలి 'కోబలి'.. విజయ్ రుద్రతాండవమే..
ఒకవైపు భక్తి .. మరోవైపు కోపం.. చేతిలో త్రిశూలం.. ఒళ్లంతా విభూది.. మెడలో రుద్రాక్షల మాలలు.. ఇలా విజయ్ దేవరకొండను కొత్త అవతార్ లో చూపిస్తోంది రణబాలి సినిమాలోని కోబలి పాట.
By: M Prashanth | 11 Oct 2026 8:59 PM ISTఒకవైపు భక్తి .. మరోవైపు కోపం.. చేతిలో త్రిశూలం.. ఒళ్లంతా విభూది.. మెడలో రుద్రాక్షల మాలలు.. ఇలా విజయ్ దేవరకొండను కొత్త అవతార్ లో చూపిస్తోంది రణబాలి సినిమాలోని కోబలి పాట. ఆ సాంగ్ లో విజయ్ కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఆయన చేసే పోరాటాలు ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్స్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. రీసెంట్ గా రెండో సింగిల్ కోబలి లిరికల్ వీడియో రిలీజ్ చేసింది.
కోబలి పాటలో విజయ్ దేవరకొండను చాలా పవర్ ఫుల్ యోధుడిగా చూపించారు. ఆయన పాత్రలోని కోపం, ఫైటింగ్ స్పిరిట్ సాంగ్ విజువల్స్ చూపిస్తున్నాయి. చేతిలో త్రిశూలం పట్టుకుని విజయ్ కనిపించే తీరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. పాటలో భక్తి భావం కూడా కనిపిస్తోంది. అదే సమయంలో యుద్ధానికి సిద్ధమైన యోధుడిలా ఆయన కనిపించడం పాటకు మరింత స్త్రెంత్ ఇచ్చింది.
సాంగ్ కు అజయ్-అతుల్ మ్యూజిక్ అందించారు. భారీ శబ్దాలతో, స్పీడ్ మ్యూజిక్ తో సాంగ్ ను పవర్ ఫుల్ గా రూపొందించారు. వి.ఎం. మహాలింగం తన వాయిస్ తో పాటకు మరింత స్త్రెంత్ తీసుకొచ్చారు. కేశవాదిత్య అందించిన సాహిత్యం కూడా పాటలోని ఇంటెన్సిటీ పెంచుతోంది. సంగీతం, సాహిత్యం, విజయ్ నటన కలిపి కోబలిని ఒక పోరాట గీతంలా మార్చేశాయి. ఇప్పటికే రణబాలి నుంచి విడుదలైన ‘ఏందయ్యా సామి’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ పాటలో విజయ్, రష్మిక మధ్య ప్రేమను చూపించగా.. ఇప్పుడు వచ్చిన కోబలిలో విజయ్ మరో యాంగిల్ కనిపిస్తోంది.
ఒక పాటలో ప్రేమికుడిగా కనిపించిన ఆయన.. మరో సాంగ్ లో కోపంతో రగిలిపోయే యోధుడిగా కనిపిస్తున్నారు. రణబాలి కథ 19వ శతాబ్దం నాటి దక్షిణ భారతదేశం నేపథ్యంలో సాగుతుంది. బ్రిటిష్ పాలన, కరవు పరిస్థితుల మధ్య తన ప్రజల కోసం పోరాడే యోధుడిగా విజయ్ కనిపించనున్నారు. తన నేలను, ప్రజలను కాపాడుకోవడం కోసం పోరాటం చేసే వ్యక్తిగా ఆయన రోల్ ను డిజైన్ చేశారు. బ్రిటిష్ అధికారులను ఎదిరించే ఆ యోధుడి కథలో యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా మెయిన్ గా ఉండనున్నాయి.
కోబలి పాటలో కనిపిస్తున్న విజయ్ ను చూస్తుంటే, సినిమాలో ఆయన రోల్ ఎంత ఇంటెన్సివ్ గా ఉండబోతోందో అర్థమవుతోంది. ముఖ్యంగా భారీ పోరాట సన్నివేశాలు, ఆయన యాక్టింగ్ ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సినిమాను నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి కోబలి పాటలో కనిపిస్తున్న విజయ్ రుద్రరూపం సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.
