'రణబాలి' డాక్యుమెంటరీ.. మేకర్స్ బిగ్ ప్లాన్ తో లాభమెంత?
ఇప్పుడు సినిమా విడుదలకు ముందే దాన్ని మరింత పెంచేందుకు మేకర్స్ ఓ కొత్త ప్లాన్ వేశారు. ప్రమోషన్స్ కు భిన్నంగా ఏకంగా ఓ డాక్యుమెంటరీ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
By: M Prashanth | 27 Sept 2026 4:48 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సినిమా అంటేనే భారీ అంచనాలు. అందులోనూ రణబాలి లాంటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా అయితే హైప్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సినిమా విడుదలకు ముందే దాన్ని మరింత పెంచేందుకు మేకర్స్ ఓ కొత్త ప్లాన్ వేశారు. ప్రమోషన్స్ కు భిన్నంగా ఏకంగా ఓ డాక్యుమెంటరీ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లీడ్ రోల్సో యాక్ట్ చేస్తున్న చిత్రం రణబాలి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా అక్టోబర్ 16న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇప్పుడు రణబాలి: నెవర్ ఫర్‌గెట్ ది ట్రూత్ పేరుతో నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్ ను మేకర్స్ ప్రకటించారు. ఆ సిరీస్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. సినిమా కథకు సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో పాటు, ఇంత భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి జరిగిన కసరత్తును ఇందులో చూపించనున్నారు. ముఖ్యంగా 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ చారిత్రక ఘటనలపై చేసిన రీసెర్చ్ ను, ఆ కాలాన్ని స్క్రీన్ పై చూపించేందుకు మూవీ టీమ్ చేసిన ప్రయత్నాలు ఆ సిరీస్ లో ఉండనున్నాయి.
దీంతో రణబాలి మూవీ స్టోరీ ఏ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిందనే విషయం ప్రేక్షకులకు ముందుగానే అర్థమయ్యే అవకాశం ఉంది. ఆ డాక్యుమెంటరీలో మొదటి ఎపిసోడ్ ది ఫెమైన్ వి ఫర్ గాట్. ఇది సెప్టెంబర్ 28న విడుదల కానుంది. రెండో ఎపిసోడ్ ది హిస్టరీ వి ఫర్ గాట్ సెప్టెంబర్ 30న వస్తుంది. మూడో ఎపిసోడ్ ది మెన్ వి ఫర్ గాట్ అక్టోబర్ 2న విడుదల కానుంది. చివరి ఎపిసోడ్ ది లాస్ట్ లోడ్ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
ఆ ఎపిసోడ్లలో చరిత్రలో పెద్దగా మాట్లాడుకోని అంశాలను పరిచయం చేయడంతో పాటు.. రణబాలి సినిమా కోసం జరిగిన భారీ రేంజ్ వర్క్ ను కూడా చూపించనున్నారు. స్క్రీన్ వెనుక విశేషాలు, నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లు, సినిమా వరల్డ్ ను క్రియేట్ చేసిన విధానం వంటి విషయాలు కూడా ఇందులో ఉండనున్నాయి. అయితే రణబాలి సినిమా ప్రమోషన్ లో ఆ డాక్యుమెంటరీ సిరీస్ కీలకంగా మారే అవకాశం ఉంది.
సాధారణంగా సాంగ్స్, టీజర్, ట్రైలర్, ఇంటర్వ్యూలతో సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. కానీ రణబాలి టీమ్ మాత్రం సినిమా కథకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ ను ప్రేక్షకులకు ముందే పరిచయం చేస్తోంది. దీంతో సినిమాపై కేవలం హైప్ పెంచడమే కాకుండా.. ప్రేక్షకులకు రణబాలి వరల్డ్ ను అర్థం చేసుకునే అవకాశం కల్పించినట్లవుతుంది. మరి రణబాలి మూవీ టీమ్ ప్రమోషన్ స్ట్రాటజీ సినిమా విడుదలకు ఎంతవరకు యూజ్ అవుతుందో వేచి చూడాలి.
