Begin typing your search above and press return to search.

రణబాలి తట్టుకుని నిలబడుతున్నాడు

విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. రణబాలి. 150 ఏళ్ల కిందటి కథను తెరమీదికి తీసుకురావడం అంటే మాటలు కాదు.

By:  Garuda Media   |   19 Oct 2026 2:52 PM IST
రణబాలి తట్టుకుని నిలబడుతున్నాడు
X

విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. రణబాలి. 150 ఏళ్ల కిందటి కథను తెరమీదికి తీసుకురావడం అంటే మాటలు కాదు. అందుకోసం లొకేషన్లు, సెట్లు అన్నీ భిన్నంగా ఉండాలి. అప్పటి వాతావరణాన్ని చూపించాలంటే చాలా ఖర్చు పెట్టాలి. పైగా ఇందులో బ్రిటిష్ సైన్యాన్ని, వారితో రణబాలి బృందం పోరాటాలను భారీ స్థాయిలో చూపించారు. ఇందులో ముఖ్య పాత్ర కోసం ‘ది మమ్మీ’ ఫేమ్ ఆస్కార్ ఒస్లూను తీసుకొచ్చారు. ఇవన్నీ ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయాలే.

విజయ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నా సరే.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రాజీ పడకుండా, ఎంతో రిస్క్ చేసి, పెద్ద బడ్జెట్లో సినిమాను రూపొందించింది. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఎంతో ఎఫర్ట్ పెట్టి సినిమాను తీర్చిదిద్దాడు. విజయ్, రష్మికలతో పాటు ఆర్టిస్టులందరూ మనసుపెట్టి నటించారు. కానీ ఈ సినిమాకు తొలి రోజు అంత మంచి టాక్ రాలేదు. ముఖ్యంగా యుఎస్ ప్రిమియర్స్ నుంచి రివ్యూలైతే చాలా వరకు నెగెటివ్‌గానే ఉన్నాయి.

మొదట్లో వచ్చిన రివ్యూలు, టాక్ చూస్తే ‘రణబాలి’ డిజాస్టర్ కాబోతోందనే చర్చ జరిగింది. సోషల్ మీడియాలో విపరీతంగా సినిమా మీద ట్రోలింగ్ కూడా నడిచింది. కానీ ఈ మిక్స్డ్ రివ్యూలు, నెగెటివిటీని తట్టుకుని ‘రణబాలి’ బలంగానే నిలబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే వస్తోంది. సినిమాకు నెమ్మదిగా టాక్ పుంజుకుంది. సినిమా స్లోగా ఉంది తప్ప, ఇది భరించలేని చిత్రం కాదు, బ్యాడ్ మూవీ కాదనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. థియేటర్లకు జనం వస్తున్నారు. మంచి ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి.

వీకెండ్లో సినిమా బాగా పెర్ఫామ్ చేస్తోంది. దసరా సెలవుల అడ్వాంటేజీని ‘రణబాలి’ బాగానే ఉపయోగించుకుంటోంది. రెండో వీకెండ్ వరకు సినిమా బాగానే నిలబడే సంకేతాలు కనిపిస్తున్నాయి. పెద్ద బడ్జెట్, పెద్ద రేట్లకు అమ్మడం వల్ల సినిమా హిట్టవుతుందా అన్నది చెప్పలేం కానీ.. ఫ్లాప్ అయ్యే సంకేతాలు మాత్రం కనిపించడం లేదు. ఎబోవ్ యావరేజ్ స్థాయిలో అయినా నిలబడడం గ్యారెంటీ అనిపిస్తోంది.