Begin typing your search above and press return to search.

'రణబాలి' హింస... 'A' తప్పదా?

విజయ్‌ దేవరకొండ హిట్‌ కొట్టి చాలా కాలం అయింది. ఆయన నుంచి కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

By:  Ramesh Palla   |   11 Sept 2026 5:05 PM IST
రణబాలి హింస... A తప్పదా?
X

విజయ్‌ దేవరకొండ తాజా చిత్రం 'రణబాలి' అక్టోబర్‌ 16, 2026న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత మొత్తం మారిపోయింది. అంతకు ముందు వరకు రణబాలి సినిమా గురించి జనాలు ఊహించుకున్నది ఒకటి అయితే, టీజర్‌లో చూసింది పూర్తి వేరుగా ఉంది. బాబోయ్‌ ఈ రేంజ్‌లో రణబాలి ఉండబోతుందా అంటూ చాలా మంది రౌడీ ఫ్యాన్స్ సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్ విషయంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్‌, సలార్‌ రేంజ్‌ యాక్షన్‌ సీన్స్ ఉంటాయనే విశ్వాసం టీజర్ చూసిన తర్వాత కలుగుతుంది. ఇదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్‌, సున్నిత మనస్కులు చూడలేనంత వయలెంట్‌గా యాక్షన్‌ సీన్స్ ఉంటాయని కూడా వార్తలు వస్తున్నాయి.

రణబాలి సినిమా టీజర్‌ రెస్పాన్స్‌...

ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సినిమాలు చేస్తేనే భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. యూత్‌ ఆడియన్స్ టార్గెట్‌గా చేసి తీసిన సినిమాలకు ఇంతకు ముందులా భారీ వసూళ్లు నమోదు కావడం లేదు. అందుకే ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ ఎక్కువ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి దూరం అయ్యే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌ను బట్టి చూస్తే సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ నుంచి 'ఎ' సర్టిఫికెట్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే అన్ని వర్గాలకు ఈ సినిమా చేరే అవకాశం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ చూడాలి అంటే సినిమాకు క్లీన్‌ యూ లేదా యూ/ఎ సర్టిఫికెట్‌ రావాల్సిందే. ఇటీవల వచ్చిన ఎ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. కనుక రణబాలి సినిమాకు ఎ సర్టిఫికెట్‌ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న మూవీ...

విజయ్‌ దేవరకొండ హిట్‌ కొట్టి చాలా కాలం అయింది. ఆయన నుంచి కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ హిట్‌ ఈ సినిమాతో దక్కడం ఖాయం అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. గీతా గోవిందం, డియర్‌ కామ్రెడ్‌ సినిమాల తర్వాత విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటించిన సినిమా ఇదే కావడంతో అంచనాలు పెరిగాయి. అలాగే దర్శకుడు రాహుల్‌ ఇప్పటి వరకు తీసిన రెండు సినిమాలు సైతం పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కించుకున్నాయి. విజయ్‌ దేవరకొండతో రాహుల్‌ తీసిన టాక్సీవాలాకి మంచి స్పందన దక్కింది. కానీ థియేట్రికల్‌ రిలీజ్‌ సమయంలో గందరగోళం కారణంగా వసూళ్లు ఎక్కువగా రాలేదు. ఇక నానితో రాహుల్‌ తీసిన శ్యామ్‌ సింగరాయ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే రాహుల్‌ పై నమ్మకంతో రణబాలి సినిమా హిట్‌ ఖాయం అనే ధీమా వ్యక్తం అవుతోంది.

దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ సినిమా...

దర్శకుడు రాహుల్‌ గత రెండు సినిమాలు ఆత్మల నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా శ్యామ్‌ సింగరాయ్‌ కొత్తగా అనిపించే విధంగా ఆత్మ కు సంబంధించిన కథను తీసుకు వచ్చాడు. రెండు టైమ్‌ జోన్‌లను కలుపుతూ ఆ సినిమాలో రాహుల్‌ చేసిన ప్రయోగం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే బి, సి ఏరియాల వారికి ఆ సినిమా ఎక్కలేదు. ఈసారి అన్ని వర్గాల ప్రేక్షకులు సైతం చూసే విధంగా రణబాలి సినిమాను రూపొందించాల్సింది. కానీ హింసాత్మక సీన్స్ ఎక్కువ ఉన్న కారణంగా చిన్న పిల్లలు సినిమాకు దూరంగా ఉండాల్సి రావచ్చు. చిత్ర యూనిట్‌ సభ్యులు సెన్సార్‌ సమయంలో కచ్చితంగా యూ/ఎ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. యూ/ఎ కావాలంటే కొన్ని సీన్స్‌లోని హింసాత్మక షాట్స్‌ ను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు రాహుల్‌ ఒప్పుకుంటాడా అనేది చూడాలి. అందుకు ఒప్పుకోకుంటే సినిమాకు 'ఎ' తప్పక పోవచ్చు.