ఆ ఇద్దరు సెకండ్ గ్రేడ్‌కి ఫిక్స్ అయినట్టేనా?
అప్పటి వరకు లైమ్ లైట్‌లో ఓ వెలుగు వెలిగి స్క్రీన్ ముందు వరుసలో ఉంటూ హంగామా చేసిన వాళ్లు ఉన్నట్టుండి తెరమరుగైపోవచ్చు.
By: Tupaki Entertainment Desk | 2 Feb 2026 12:10 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. హీరో క్యారెక్టర్‌కు వెనకాల ఎలాంటి ఇంపార్టెన్స్ లేని వాళ్లు ఉన్నట్టుండి హీరోలు అయిపోవచ్చు. అప్పటి వరకు లైమ్ లైట్‌లో ఓ వెలుగు వెలిగి స్క్రీన్ ముందు వరుసలో ఉంటూ హంగామా చేసిన వాళ్లు ఉన్నట్టుండి తెరమరుగైపోవచ్చు. ఇక్కడ ఏదైనా సాధ్యమే.. చాలా మంది విషయంలో ఇది నిజమని తేలిసింది కూడా. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే ఇంత వరకు లైమ్ లైట్‌లో పతాక స్థాయిలో మెరిసిన ఇద్దరు స్టార్స్ గత కొన్ని నెలలుగా వెనకబడిపోతున్నారు.
వారే దగ్గుబాటి రానా, శృతిహాసన్. 'బాహుబలి'తో పాతక స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకున్న రానా ఆ తరువాత మాత్రం ఆ స్థాయి క్రేజ్‌ని, ఆఫర్స్‌ని దక్కించుకోలేకపోతున్నాడు. 'నేనే రాజు నేనే మంత్రి' మూవీ తరువాత రానా ఆ స్థాయి సినిమాలో చేయలేదు..ఆ స్థాయి క్యారెక్టర్‌లో ఆకట్టుకోలేకపోయాడు. 'భీమ్లా నాయక్'తో మళ్లీ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లవైపే ప్రయాణించడం మొదలు పెట్టాడు. రజనీకాంత్ 'వెట్టయాన్'లోనూ విలన్‌గా కనిపించి షాక్ ఇచ్చాడు. ఆ మార్కు క్యారెక్టర్ల నుంచి బయటపడాలనుకున్నాడో ఏమో కానీ మునుపటి తరహాలో నటించడం తగ్గించాడు.
'మిరాయ్'లో చిన్న గెస్ట్ క్యారెక్టర్, కాంతలో ఇన్స్‌స్పెక్టర్ క్యారెక్టర్లలో కనిపించాడు. ఇక రీసెంట్‌గా విడుదలైన తమిళ మూవీ `పరాశక్తి`లోనూ మైఖేల్ రెడ్డి అనే గెస్ట్ క్యారెక్టర్‌లో మాత్రమే మెరవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వరుసగా సినిమాలు చేస్తాడనుకున్న రానా ఇలా గెస్ట్ క్యారెక్టర్లు, చిన్న సినిమాలకు ప్రజెంటర్‌గా మాత్రమే వ్యవహరిస్తుండటంతో తను ఇక ఇలాంటి పాత్రలకే ఫిక్స్ అయ్యాడా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రానా ఇకపై కూడా ఇలాంటి పాత్రలే చేస్తాడా? .. లేక మళ్లీ కొత్త తరహా పాత్రలు, సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తాడా? అన్నది వేచి చూడాలి.
ఇదే తరహాలో శృతిహాసన్ కెరీర్ కూడా సాగుతోంది. ఒక దశలో క్రేజీ హీరోయిన్ అనిపించుకున్న శృతి గత రెండేళ్లుగా ఎలాంటి ప్రాధాన్యతలేని పాత్రలు, సినిమాలు చేస్తోంది. 'సలార్'లోనూ తన క్యారెక్టర్‌కు పెద్దగా ప్రాధాన్యత కనిపించదు. ఇక రజనీ `కూలీ`లో తన క్యారెక్టర్ గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార'లోనూ శృతిది సెకండ్ లీడ్ క్యారెక్టర్. పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి నటిస్తోంది.
లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో శృతి సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో అంతా అవాక్కవుతున్నారు. `సలార్ 2` బ్లాక్ బస్టర్ అయితే తప్ప శృతిహాసన్ కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో తన అభిమానులు అంతా `సలార్ 2` బ్లాక్ బస్టర్ హిట్ కావాలని, అందులో శృతి క్యారెక్టర్‌కు మంచి స్కోప్ లభించాలని కోరుకుంటున్నారట.
