Begin typing your search above and press return to search.

వారణాసి : ఫ్యాన్స్‌ ఎదురు చూసిన రణకుంభ వచ్చేసింది

ఇండియన్‌ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'వారణాసి' సినిమాను ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్నాడు.

By:  Ramesh Palla   |   19 Nov 2025 4:02 PM IST
వారణాసి : ఫ్యాన్స్‌ ఎదురు చూసిన రణకుంభ వచ్చేసింది
X

ఇండియన్‌ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'వారణాసి' సినిమాను ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్నాడు. రెండేళ్లుగా వార్తల్లో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ఇటీవల గ్లోబ్‌ ట్రోటర్‌ ఈవెంట్‌ నిర్వహించి రివీల్‌ చేశారు. ముఖ్యంగా మహేష్ బాబు లుక్‌ ను రివీల్‌ చేయడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఫిదా అవుతున్నారు. దేశవ్యాప్తంగా రాజమౌళి సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంటుంది. సౌత్‌ ఇండియన్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా నార్త్‌ ఇండియన్ సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాతో తమ హీరో పాన్‌ వరల్డ్‌ హీరోగా మారబోతున్నాడు అని నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కటీ చాలా స్పెషల్‌గా రాజమౌళి ప్లాన్‌ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా కీరవాణి సంగీతం అద్భుతంగా ఉండబోతుంది.

పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఎంట్రీ ట్రాక్ వచ్చింది..

గ్లోబ్‌ట్రోటర్‌ ఈవెంట్‌ లో రాజమౌళి ఒకొక్క పాత్రను పరిచయం చేసే సమయంలో ప్రత్యేక మ్యూజిక్‌ ను ప్లే చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ స్టేజ్‌ పై ఎంట్రీ ఇచ్చిన సమయంలో వచ్చిన రణకుంభ మ్యూజిక్‌ ట్రాక్‌ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. రణకుంభ ట్రాక్‌ యూట్యూబ్‌ ద్వారా ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూశారు. ఎట్టకేలకు కీరవాణి యూట్యూబ్‌ ద్వారా ఈ ఆడియో ట్రాక్ ను విడుదల చేయడం జరిగింది. పృథ్వీరాజ్ సుకుమారన్‌ పాత్ర ఎలా ఉంటుందో ఈ ట్రాక్‌ లో చెప్పకనే చెప్పారు. కచ్చితంగా ఆయన పాత్ర కనీసం పదేళ్లు గుర్తు ఉండి పోతుంది అంటూ సోషల్‌ మీడియాలో ప్రముఖంగా ఈ ట్రాక్ గురించి చర్చ జరుగుతోంది. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన వెంటనే ఈ ట్రాక్ వైరల్‌ అయ్యింది.

ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా...

మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి అందిస్తున్న సంగీతం ప్రత్యేకంగా నిలవడం ఖాయం అనిపిస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత రాజమౌళి సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ రేంజ్‌ కి వెళ్లింది. ఇండియాకు ఆస్కార్‌ తీసుకు వచ్చింది. అందుకే ఇప్పుడు కాంబో అదిరి పోవడం ఖాయం అని అంతా నమ్మకంగా చెబుతున్నారు. భారీ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గత రికార్డ్‌లను బ్రేక్ చేసి, హాలీవుడ్‌ ప్రేక్షకులను సైతం నోరు వెళ్లబెట్టుకుని మరీ చూసే విధంగా సినిమా ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వచ్చిన సౌండ్‌ ట్రాక్‌, గ్లిమ్స్ బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అంచనాలు పెంచింది. సినిమా విజయం విషయంలో ఎలాంటి అనుమానం లేదు అంటూ అభిమానులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో వారణాసి మూవీ

రాజమౌళి దర్శకత్వంలో గతంలో వచ్చిన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలను మించి విజువల్‌ వండర్‌గా వారణాసి ఉంటుంది అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే ఉన్న రికార్డ్‌లు అన్నింటిని కూడా వారణాసి సినిమా బ్రేక్ చేస్తుందనే విశ్వాసంతో అభిమానులు ఉన్నారు. కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజమౌళి తనయుడు కార్తికేయ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ ట్యాలెంటెడ్‌ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర వీల్‌ చైర్‌ కి పరిమితం అయ్యి ఉంటుందా ఇంకాస్త ఎక్కువ ఉంటుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. 2027 సమ్మర్ వరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా ఏడాదిన్నర పాటు ఈ సినిమా కోసం ఎదురు చూడాల్సిందే.