Begin typing your search above and press return to search.

రానా కూడా నిర్మాత‌గా రికార్డు కోసం!

టాలీవుడ్ స్టార్ రానా న‌టుడిగా కంటే నిర్మాత‌గా బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. త‌న సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియాపై వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

By:  Srikanth Kontham   |   5 Nov 2025 10:25 AM IST
రానా కూడా నిర్మాత‌గా రికార్డు కోసం!
X

టాలీవుడ్ స్టార్ రానా న‌టుడిగా కంటే నిర్మాత‌గా బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. త‌న సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియాపై వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. కంటెంట్ బేస్ట్ చిత్రాల‌ను నిర్మిస్తూ నిర్మాత‌గా త‌న ఫ్యాష‌న్ చాటుకుంటున్నాడు. సాధార‌ణంగా రిస్క్ ప్రాజెక్ట్ లు నిర్మించాలంటే చాలా మంది నిర్మాత‌లు ముందుకు రారు. కానీ రానా మాత్రం ధైర్యంగా ముంద‌డుగు వేస్తున్నాడు. త‌న సంస్థ‌తో పాటు ఇత‌ర నిర్మాత‌ల‌ను భాగ‌స్వామ్యం చేసుకుని త‌న‌కు న‌చ్చిన క‌థ‌ల ప‌ట్ల వాళ్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ నిర్మాతల అభిరుచుల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నాడు.

పాన్ ఇండియాలో రిలీజ్ ప్లాన్:

ఇండ‌స్ట్రీలో ఇదొక శుభ ప‌రిమాణంగా భావించొచ్చు. చాలా మంది నిర్మాత‌లు క‌మ‌ర్శియ‌ల్ కాన్సెప్ట్ లు అయితేనే నాలుగు రూపాయ‌లు వ‌స్తాయ‌ని వాటివైపే చూస్తారు. కానీ మారిన ట్రెండ్ ని ప‌ట్టుకోలేరు. అలాంటి వాళ్ల‌ను రానా తెలివిగా వాష్ చేస్తూ త‌న‌వైపు తిప్పుకుంటున్నాడు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ తో `కాంత` సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వే ఫ‌రేర్ ఫిల్మ్స్ భాగ‌స్వామ్యంలో నిర్మిస్తోన్న చిత్ర‌మిది. ఇదొక పీరియాడిక్ థ్రిల్ల‌ర్. త‌మిళ్ లో తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

'మానాడు' రీమేక్ ఆలోచ‌న‌లో:

తాజాగా 'స్పిరిట్' ప్రొడ‌క్ష‌న్ హౌస్ బాలీవుడ్ లో కూడా ఎంట‌ర్ అవుతుంది. ఈ విష‌యాన్ని రానా స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. తొలి సినిమా మ‌నోజ్ బాజ్ పాయ్ తో నిర్మిస్తున్నాడు. అరవింద్ ఆడిగా రాసిన ప్రసిద్ధ నవల'లాస్ట్ మాన్ ఇన్ టవర్' ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బెన్ రేఖి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ లో సౌత్ రీమేక్ లు కూడా రానా ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. త‌మిళ చిత్రం 'మానాడు' హిందీలో రీమేక్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

దేశంలో అన్నిభాష‌ల్లో నిర్మాత‌గా:

దీనికి ద‌ర్శ‌కుడిగా అశ్విన్ గంగ‌రాజును తీసుకోవాల‌నుకుంటున్నాడుట‌. స్క్రిప్ట్ ప‌నులు కూడా మొద‌ల‌య్యాయ‌ని స‌మాచారం. రానా స్పీడ్ చూస్తుంటే? స్పిరిట్ మీడియా సంస్థ‌లో అన్ని భాష‌ల్లోనూ సినిమాలు నిర్మించాలి అనే టార్గెట్ క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే మూడు భాష‌ల్లో లాంచ్ అయిన నేప‌థ్యంలో మిగ‌తా భాష‌ల్లోనూ ప్రారంభించే అవ‌కాశం లేక‌పోలేదు. తాతాయ్య రామానాయుడు దేశంలో అన్ని భాష‌ల్లో సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాత‌గా రికార్డు నెల‌కొల్పిన సంగ‌తి తెలిసిందే. తాత త‌ర‌హాలోనే రానా కూడా నిర్మాత‌గా రికార్డు కోసం ట్రై చేస్తున్నాడేమో.