అమెరికాలో రామానాయుడు స్టూడియో!
మూవీ మోఘల్ రామానాయుడు సినీ ప్రస్థానం..చిత్ర పరిశ్రమలో ఆయన ఎదిగిన వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 17 Nov 2025 6:28 PM ISTమూవీ మోఘల్ రామానాయుడు సినీ ప్రస్థానం..చిత్ర పరిశ్రమలో ఆయన ఎదిగిన వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు. దేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించిన ఎకైక లెజెండరీ నిర్మాత. రామానాయుడు స్టూడియోస్ ద్వారా ఎంతో మంది నటీనటుల్ని, టెక్నిషియల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. సామాజిక కార్యక్రమాల్లోనూ అంతే విధిగా పాలు పంచుకునేవారు. తనతో పాటు నలుగురు ఎదగాలని కోరుకునే గొప్ప మనసున్న వ్యక్తి. అప్పట్లోనే ఎంతో అడ్వాన్స్ గా ఆలోచించి హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోను ప్రారంభించారు.
అప్పట్లోనే అగ్రరాజ్యంపై కన్ను:
రామానాయుడు స్టూడియో అంటే సినిమాలకు నిలయం లాంటింది. నిత్యం కొత్త సినిమాల ప్రారంభోత్సవాలతో, షూటింగ్ లతో హడావుడిగా ఉంటుంది. మరోవైపు ల్యాబ్ లో జరిగాల్సిన పనులు జరుగుతుంటాయి. అలాగే సాగర నగరం విశాఖ పట్టణంలోకూడా ఆ రోజుల్లోనే రామానాయుడు స్టూడియోను స్థాపించారు. తీరాన్ని అనుకుని ఉన్న స్టూడియో ఎంతో సుందరంగా ఉంటుంది. తమ స్టూడియో ద్వారా కొత్త కొత్త టెక్నాలజీలను పరిచయం చేయడం అప్పట్లో పెద్దాయన ప్రత్యేకతగా చెప్పుకొచ్చేవారు. అలాంటి నాయుడు గారి కన్ను అప్పట్లోనే అగ్రరాజ్యం అమెరికాపై పడిందని ఎంత మందికి తెలుసు?
అప్పట్లో విచిత్రంగా అనిపించింది:
అవును నాయుడు రామానాయుడు స్టూడియోను అమెరికాలో కూడా స్థాపించాలని కలలు గనేవారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన మనవడు, నటుడు రానా రివీల్ చేసారు. `లీడర్` సినిమా సమయంలోనే రానాతో ఈ మాట నాయుడు గారు అన్నారు. ఆ సినిమా డైరెక్టర్ శేఖర్ కమ్ములా అమెరికాలో ఉద్యోగం చేసి హైదరాబాద్ కి వచ్చి `లీడర్` సినిమా తీసిన సమయంలోనే ఈ మాట అన్నట్లు రానా తెలిపారు. అప్పటి రోజు ల్లోనే తాతయ్య ఎంతో అడ్వాన్స్ గా ఆలోచించేవారన్నారు. `లీడర్` సినిమా గురించి మాట్లాడుతారనుకుంటే? ఆయన ఆమెరికాలో స్టూడియో గురించి మాట్లాడుతున్నారేంటి? తనకనింపించేదన్నారు.
అమెరికాలో స్టూడియో భవిష్యత్ ఆలోచన:
ఆ మాట అన్న చాలా సంవత్సరాలు తాతయ్య విజన్ తనకు అర్దమైందన్నారు. కారం చేడు నుంచి చెన్నై వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి ఎలాంటి స్టూడియోలు లేని సమయంలో రామానాయడు స్టూడియో కట్టారంటే నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అమెరికా నుంచి శేఖర్ ఇండియాకి వచ్చి సినిమా తీయడం ఏంటి? మనం అక్కడే స్టూడియో కడితే అక్కడే సినిమా తీస్తారు? కదా? అన్నది తాతగారి ఆలోచన. ఇది ఎంతో భవిష్యత్ ఆలోచనగా నాకు ఇప్పుడనిపిస్తుంది. ఇలాంటి ఆలోచన చేయాలంటో ఎంతో ధైర్యం కావాలన్నారు రానా. మరి తాతయ్య చివరి కోరికను మనవడు తీరుస్తాడా? లేదా? అన్నది చూడాలి.
