Begin typing your search above and press return to search.

రానా కూడా తండ్రి కానున్నాడా? మిహీకా పోస్ట్ అర్థమదేనా?

ఆ యాప్ లోనే మిహీకా పరిచయమైందని చెప్పారు. అలా పెళ్లి చేసుకున్న రానా- మిహీకా.. మ్యారేజ్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

By:  M Prashanth   |   31 July 2025 1:14 PM IST
రానా కూడా తండ్రి కానున్నాడా? మిహీకా పోస్ట్ అర్థమదేనా?
X

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి లాక్ డౌన్ టైమ్ లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. షీ సెడ్ ఎస్ అనే ప్రముఖ ఈవెంట్ సంస్థ మేనేజర్ మిహీకా బజాజ్ ను మనువాడనున్నట్లు ప్రకటించి అప్పట్లో అందరికీ చిన్నపాటి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పెళ్లి చేసుకున్నారు. 2020 ఆగస్టు 8వ తేదీన రానా- మిహికా వివాబంధంతో ఒక్కటయ్యారు.


అయితే మిహీకా బజాజ్.. విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత క్లాస్మేట్ అని, ఆమె మ్యారేజ్ లో ఇద్దరూ క్లోజ్ అయ్యామని ఓ సారి తెలిపారు. ఆ పరిచయం స్నేహంగా మారి పెళ్లి చేసుకున్నామని చెప్పారు. మరోసారి కరోనా టైమ్ బోర్ కొట్టి కొత్త కొత్త వాళ్లను పరిచయం కోసమని హౌస్ పార్టీ అనే యాప్ ను డౌన్లోడ్ చేశానని రానా దగ్గుబాటి వెల్లడించారు.

ఆ యాప్ లోనే మిహీకా పరిచయమైందని చెప్పారు. అలా పెళ్లి చేసుకున్న రానా- మిహీకా.. మ్యారేజ్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ అటు ప్రొఫెషనల్ లైఫ్ ను.. ఇటు వివాహ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరలవుతోంది. త్వరలోనే పేరెంట్స్ గా వారిద్దరూ ప్రమోట్ అవ్వనున్నారని టాక్ వస్తోంది.

రీసెంట్ గా మిహీకా.. క్రీమ్ కలర్ డ్రెస్ లో దిగిన పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు క్యాప్షన్ గా జస్ట్ ఇప్పుడే అనిపించిందంటూ రాసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. మిహీకా ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అది నిజమో లేదా అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ అంతా విషెస్ మాత్రం చెప్పేస్తున్నారు.

అయితే కొన్ని నెలల క్రితం ఇలాంటి రూమర్సే స్ప్రెడ్ అయ్యాయి. ఆ సమయంలో తాను ప్రెగ్నెంట్ కాదని మిహీకా తెలిపారు. తాను పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నానని, ఈ మధ్య బరువు పెరిగానని పేర్కొన్నారు. దీంతో అందరూ

ప్రెగ్నెంట్‌ అనుకుంటున్నారంతేనని అన్నారు. ప్రెగ్నెంట్‌ అయినప్పుడు తప్పుకుండా చెబుతానని వెల్లడించారు.

అందుకే ఇప్పుడు క్రేజీ క్యాప్షన్ తో ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసినట్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హెల్త్ కేర్ తీసుకోండి మేడమ్ అని చెబుతున్నారు. కాగా.. సోషల్ మీడియాలో మిహీకా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తుంటారు. అందులో భాగంగా ఇప్పుడు షేర్ చేసిన పిక్ కమ్ పోస్ట్ తోనే ప్రెగ్నెన్సీ వార్తలు, రూమర్లు మొదలయ్యాయి. మరి మిహీకా, రానా దంపతులు రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.