Begin typing your search above and press return to search.

దగ్గుబాటి ఇంట్లో అసలైన గ్లోబల్ ట్రావెలర్ ఎవరో తెలుసా?

చాలామంది స్టార్ భార్యలు సినిమా గ్లామర్ ప్రపంచం వైపో? లేదా నటన వైపో ?మొగ్గు చూపుతారు. కానీ మిహీకా బజాజ్ మాత్రం కార్పొరేట్ - డిజైనింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

By:  Srikanth Kontham   |   2 Sept 2026 3:00 PM IST
దగ్గుబాటి ఇంట్లో అసలైన గ్లోబల్ ట్రావెలర్ ఎవరో తెలుసా?
X

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి షూటింగ్స్, నిర్మాణ బాధ్యతలు, ప్రమోషన్లతో నిరంతరం బిజీగా ఉంటారనే విషయం తెలిసిందే. హైదరాబాద్, ముంబై, చెన్నై ల మధ్య ఆయన ప్రయాణాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రానా కంటే కూడా ఆయన సతిమణి మిహీకా బజాజ్ వృత్తిపరమైన అవసరాల రీత్యా మరింత ఎక్కువగా దేశవిదేశాలు ప్రయాణిస్తుండటం విశేషం. చాలామంది స్టార్ భార్యలు సినిమా గ్లామర్ ప్రపంచం వైపో? లేదా నటన వైపో ?మొగ్గు చూపుతారు. కానీ మిహీకా బజాజ్ మాత్రం కార్పొరేట్ - డిజైనింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

`డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో` పేరుతో స్వయంగా ఇంటిరియర్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ , హై-ఎండ్ వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థను మిహీకా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఆమె కుటుంబానికి ప్రతిష్టాత్మకమైన జ్యువెలరీ వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇంటిరియర్ డిజైనింగ్ - లగ్జరీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగాలు పూర్తిగా లొకేషన్ విజిట్స్, క్లయింట్ మీటింగ్స్, ప్రొడక్ట్ సోర్సింగ్‌పైనే ఆధారపడి ఉంటాయి. లండన్ విశ్వవిద్యాలయం నుంచి డిజైనింగ్‌లో మాస్టర్స్ చేసిన మిహీకా బిజినెస్ డెవలప్‌మెంట్ కోసం ముంబై, ఢిల్లీలతో పాటు జైపూర్, ఉదయ్‌పూర్ వంటి రాజభవనాల లొకేషన్లకు, లండన్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలకు తరచూ ప్రయాణించాల్సి వస్తుంది.

రానా దగ్గుబాటి షెడ్యూల్స్ ఎక్కువగా ముందుగానే ప్లాన్ చేసిన షూటింగ్ లొకేషన్లు ,ఒకే ప్రాంతంలో జరిగే సుదీర్ఘ షెడ్యూళ్లకు పరిమితమైతే మిహీకా ప్రయాణాలు మాత్రం క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. డెకోర్ మెటీరియల్స్ సోర్సింగ్, ఆర్కిటెక్చరల్ డిజైన్స్ పర్యవేక్షణ, విదేశీ బ్రాండ్లతో సమావేశాల కోసం ఆమె నెలకు అనేక నగరాలు మారాల్సి వస్తుంది.

వ్యాపార రంగంలో స్వతంత్రంగా ఎదిగేందుకు మిహీకా చూపుతున్న సమర్థత పరిశ్రమ వర్గాల్లో విస్తృత ప్రశంసలు అందుకుంటోంది. స్టార్ హీరో భార్య అనే గుర్తింపును పక్కనపెట్టి వినూత్న ఎంటర్‌ప్రెన్యూర్ గా ఆమె నిరంతరం కష్టపడుతుండటం, వృత్తిపట్ల ఆమెకున్న అంకితభావాన్ని స్పష్టం చేస్తోంది. ఒకవైపు రానా సినీ ప్రపంచాన్ని ఏలుతుంటే? మరోవైపు మిహీకా కార్పొరేట్ డిజైనింగ్ రంగాన్ని శాసిస్తోంది.

మొత్తానికి దగ్గుబాటి వారి ఇంట్లో రానా కంటే కూడా ఎయిర్‌పోర్ట్ రన్స్ -బిజినెస్ టూర్స్ ఎవరివైనా ఎక్కువగా ఉన్నాయంటే? అది కచ్చితంగా మిహీకా బజాజ్‌వేనని సినీ - ఫ్యాషన్ వర్గాలు సరదాగా చర్చించుకుంటాయి. ఇద్దరూ తమ వృత్తులలో గ్లోబల్ ట్రావెలర్స్‌గా దూసుకుపోతుండటం పవర్ కపుల్ ప్రత్యేకతగా నిలుస్తోంది.