ఆ మేడమ్‌ను పట్టింది మేమే.. కానీ ఇంతలో స్టార్ అయిపోయింది: రానా
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'కాంత'.
By: M Prashanth | 6 Nov 2025 10:05 PM ISTదుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'కాంత'. పీరియాడిక్ డ్రామాగా, సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి హైప్ క్రియేట్ చేయగా, లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హడావుడిగా జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరో దుల్కర్ సల్మాన్, నిర్మాత రానా దగ్గుబాటి, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సహా చిత్ర బృందం పాల్గొంది. అయితే ఈ ఈవెంట్‌లో రానా దగ్గుబాటి చేసిన కొన్ని సరదా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ గురించి రానా మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సినిమాలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సే గురించి రానా మాట్లాడుతూ.. "మేడమ్ గారు కరెక్ట్" అంటూ నవ్వుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. "ఆ మేడమ్‌ను ఫస్ట్ పట్టింది (సెలెక్ట్ చేసింది) మేమే" అంటూ రానా అసలు విషయం చెప్పారు. దీంతో స్టేజ్‌పై ఉన్న దుల్కర్, భాగ్యశ్రీ సహా అందరూ నవ్వేశారు. రానా మాటలు అక్కడున్న వారిలో ఆసక్తిని రేపాయి.
ఆ తర్వాత రానా అసలు విషయం చెప్పారు. "మేము ఈ సినిమాను ఫైనల్ చేసి, షూటింగ్ చేసే డిలేలో ఆవిడ (భాగ్యశ్రీ) తెలుగులో వేరే సినిమాలు కూడా పూర్తి చేసి, ఇంత పాపులర్ స్టార్ అయిపోయారు" అని రానా చమత్కరించారు. అంటే, భాగ్యశ్రీ టాలెంట్‌ను తామే మొదట గుర్తించామని, కానీ తమ సినిమా ఆలస్యం అయ్యేసరికి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చి స్టార్ అయ్యారని రానా సరదాగా వ్యాఖ్యానించారు.
'కాంత' సినిమాతో భాగ్యశ్రీ బోర్సే ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అయితే రానా మాటలను బట్టి చూస్తే, ఆమెను ఎంపిక చేసిన తర్వాత సినిమా కాస్త ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లోనే ఆమెకు తెలుగులో ఇతర అవకాశాలు వచ్చాయి. రానా కామెంట్స్ కి హీరోయిన్ భాగ్యశ్రీ సిగ్గుపడుతూ నవ్వుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
