Begin typing your search above and press return to search.

మాహిష్మతిలో రామ్ చరణ్ ఉంటాడా.. రానా పంచ్..!

సెలబ్రిటీస్ పబ్లిక్ లో కనిపిస్తే వాళ్లని చూసిన ఆనందంలో ఏం మాట్లాడాలో తెలియక ఆడియన్స్ కన్ ఫ్యూజ్ అవుతారు.

By:  Ramesh Boddu   |   8 Sept 2025 12:00 PM IST
మాహిష్మతిలో రామ్ చరణ్ ఉంటాడా.. రానా పంచ్..!
X

సెలబ్రిటీస్ పబ్లిక్ లో కనిపిస్తే వాళ్లని చూసిన ఆనందంలో ఏం మాట్లాడాలో తెలియక ఆడియన్స్ కన్ ఫ్యూజ్ అవుతారు. ఏదో ఒకటి మాట్లాడుటారు. ఐతే దాన్ని కొందరు సెలబ్రిటీస్ పట్టించుకోరు కానీ మరికొందరు మాత్రం రివర్స్ పంచ్ వేసి అలరిస్తారు. ఆడియన్స్ లో ఇంటరాక్షన్ ఇలా ఉంటేనే బాగుంటుందని కొందరు హీరోలు భావిస్తారు. ఈ క్రమంలో రీసెంట్ ఆ దగ్గుబాటి హీరో రానా ఒకచోట ఆడియన్స్ తో సెల్ఫీ దిగుతూ అందులో ఒకరు చేసిన కామెంట్ కి సూపర్ పంచ్ ఇచ్చాడు. ఐతే దానితో అతను అవాక్కయ్యాడు.

జై మాహిష్మతి.. జై రామ్ చరణ్..

ఇంతకీ అసలేం జరిగింది అంటే.. రానా రీసెంట్ గా పబ్లిక్ లోకి వెళ్లాడు. రానా వస్తున్నాడని తెలిసి అతను ఎగ్జిట్ గేట్ దగ్గర కొందరు సెల్ఫీ కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో కొందరు రానాని చూడగానే అని బాహుబలిలో డైలాగ్ చెప్పారు. ఐతే ఆ పక్కన ఉన్న మరొకతను జై రామ్ చరణ్ అన్నాడు. ఐతే అప్పుడే రానా మాహిష్మతితో రాంచరణ్ ఉంటాడా అని అన్నాడు. దానికి అతను ఆన్సర్ ఇస్తూ చరణ్ మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా సార్ అన్నాడు.

అలా రానా సరదాగా పంచ్ వేశాడు. రానా ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ ఇలానే చాలా సరదా సరదాగా ఉంటుంది. దగుబాటి వారసుడిగా రానా తన మార్క్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఒక మూసలో వెళ్లే సినిమాలు చేయడం రానాకు నచ్చదు. అందుకే రానా ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాడు. రానా దగ్గుబాటి ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ లు లైన్ లో పెట్టాడు.

విరాటపర్వం తర్వాత రానా నెక్స్ట్ సినిమా..

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ తర్వాత రానా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రానా కూడా కావాలంటే కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కానీ తెలుగు ఆడియన్స్ కు మంచి సినిమాలు, డిఫరెంట్ స్టోరీస్ వినిపించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే తన లాంచింగ్ సినిమా కూడా ఒక కమర్షియల్ సినిమాలా కాకుండా లీడర్ తో ఎంట్రీ ఇచ్చాడు. విరాటపర్వం తర్వాత రానా నెక్స్ట్ సినిమా రాలేదు. ఈమధ్యనే రానా నాయుడు 2 వెబ్ సీరీస్ వచ్చినా ఫస్ట్ సీజన్ రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు.

హీరోగానే కాదు నిర్మాతగా కూడా రానా తన స్పెషాలిటీ చూపిస్తాడు. లో బడ్జెట్ తో కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే చాలు ఆ సినిమాలకు తన సపోర్ట్ అందిస్తాడు రానా. రానా ప్రెజెన్స్ లో సినిమా వస్తుంది అంటే కచ్చితంగా మంచి కంటెంట్ ఉంటుందని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. లాస్ట్ ఇయర్ రజనీకాంత్ వేటయ్యన్ సినిమాలో విలన్ గా చేసిన రానా నెక్స్ట్ సినిమాలతో సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నాడు.