Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్‌తో ప్ర‌భాస్ గురించి రానా అలా అనేశారేమిటి?

బాహుబ‌లి - ది బిగినింగ్, బాహుబ‌లి - ది క‌న్ క్లూజన్ సినిమాలను ఒకే సినిమాగా రీమాస్ట‌ర్ చేసిన వెర్ష‌న్ ని `బాహుబ‌లి - ది ఎపిక్` పేరుతో రీరిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   28 Aug 2025 9:58 AM IST
ఫ్యాన్స్‌తో ప్ర‌భాస్ గురించి రానా అలా అనేశారేమిటి?
X

బాహుబ‌లి - ది బిగినింగ్, బాహుబ‌లి - ది క‌న్ క్లూజన్ సినిమాలను ఒకే సినిమాగా రీమాస్ట‌ర్ చేసిన వెర్ష‌న్ ని `బాహుబ‌లి - ది ఎపిక్` పేరుతో రీరిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ లో ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన టీజ‌ర్ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగించింది. తాజాగా ఈ చిత్రంలో భ‌ళ్లాల దేవ పాత్ర‌లో న‌టించిన రానా ద‌గ్గుబాటి రెడిట్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' (ఏఎంఎ) సెష‌న్ ని నిర్వ‌హించ‌గా దానికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

కొంద‌రు అభిమానులు రానా ద‌గ్గుబాటిని ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసారు. ఒక అభిమాని బాహుబ‌లిని చంపినందుకు చింతిస్తున్నారా? అని ప్ర‌శ్నించ‌గా ''అస్స‌లు లేదు'' అని రానా జ‌వాబిచ్చారు. రాజ‌మౌళి వ‌ల్ల‌నే ఈ చిత్రం అద్భుత ఇతిహాసంగా మారింద‌ని మీరు భావిస్తున్నారా? అని ప్ర‌శ్నించ‌గా, ''అవును ప్ర‌తిరోజూ'' అంటూ రానా స‌మాధాన‌మిచ్చారు. ప్ర‌భాస్ మీకు ఇంకా ట‌చ్ లో ఉన్నారా? అని ఒక అభిమాని ప్ర‌శ్నించారు.. ''అవును, చాలా'' అంటూ రానా జ‌వాబిచ్చారు.

ఒక‌వేళ బాహుబ‌లి పాత్ర‌లో మీరు న‌టించాల్సి వ‌స్తే న‌టిస్తారా? లేదా భ‌ళ్లాల‌దేవ పాత్ర‌నే ఇష్ట‌ప‌డ‌తారా? అని ఒక అభిమాని ప్ర‌శ్నించ‌గా 'భ‌ళ్లా రాజు' అని త‌న పాత్ర‌పై అభిమానం చాటుకున్నాడు. భ‌ళ్లాలుని పాత్ర‌లో కష్ట‌మైన భాగం ఏది? అని ప్ర‌శ్నించ‌గా, ఈ పాత్ర స‌వాల్‌తో కూడుకున్న‌దైనా ఆనందాన్నిచ్చింద‌ని రానా జ‌వాబిచ్చారు. విరామానికి ముందు బాహుబ‌లి పేరును మాహిష్మ‌తి ప్ర‌జలు జ‌పించేప్పుడు.. మీ చిరున‌వ్వు నిజ‌మైన‌దా.. దుర్మార్గ‌పు న‌వ్వు అనుకోవ‌చ్చా? అని ప్ర‌శ్నించ‌గా, ''నా ముందు బాహబ‌లి నామం జపిస్తే ఇప్ప‌టికీ కోపం వ‌స్తుంది'' అని స‌ర‌దాగా బ‌దులిచ్చారు.

ఓవ‌రాల్ గా అన్ని ప్ర‌శ్న‌ల‌కు రానా ద‌గ్గుబాటి సంతృప్తిక‌ర‌మైన జ‌వాబులిచ్చారు. త‌న పాత్ర ఔచిత్యాన్ని వివ‌రిస్తూ, త‌న‌కు భ‌ళ్లాల దేవ పాత్ర ఎంత ఇష్ట‌మైన‌దో అభిమానుల‌తో ముచ్చ‌టించారు. ప్ర‌శ్నోత్త‌రాలు ఆస‌క్తిని క‌లిగించాయి. రెండు భాగాల బాహుబ‌లి చిత్రాన్ని 'ది ఎపిక్‌' పేరుతో ఒకే సినిమాగా చూసే అవ‌కాశం మేక‌ర్స్ క‌ల్పిస్తున్నందుకు అభిమానులు చాలా ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు.