రానా అన్ని రకాలుగా ఆగిపోయాడే!
`బాహుబలి` తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అక్కడి నుంచి డార్లింగ్ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోకుండా సాగిపోతున్నాడు.
By: Srikanth Kontham | 5 Nov 2025 5:00 AM IST'బాహుబలి' తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అక్కడి నుంచి డార్లింగ్ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోకుండా సాగిపోతున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ గా డార్లింగ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి అదే `బాహుబలి`లో బల్లాల దేవగా నటించిన రానా పరిస్థితి ఏంటి? అంటే అతడి కెరీర్ చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు కనిపిస్తోంది. `బాహుబలి` తర్వాత చాలా సినిమాలు చేసాడు రానా. కానీ అవేవి హీరోగా నటించిన సినిమాలు కాదు. అందులో కొన్ని మాత్రమే. అవి కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.
రానా ప్రయాణం అన్ని రకాలుగా:
ఇక పాన్ ఇండియా మాట అయితే ఎత్తాల్సిన పనేలేదు. అతడి కెరీర్ ఆరంభంలో ఎలా సాగిందో ఇప్పుడు అలాగే సాగుతోంది. రానా హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. చివరిగా `1945` లో నటించాడు. మంచి కాన్సెప్ట్ అయినా కమర్శియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కామియో పాత్రలకే పరిమితమయ్యాడు. మధ్యలో నిర్మాణం వైపు కూడా అడుగులు వేసి కొన్ని సినిమాలు నిర్మించాడు. హీరో అవకాశాలు అయితే రానే లేదు. పోనీ సొంత నిర్మాణ సంస్థలో తానే హీరోగా ఏదైనా సినిమా నిర్మించే ఆలోచన చేస్తున్నాడా? అంటే అదీ లేదు.
బాహుబలి తర్వాత సౌండింగ్ లేదు:
ఇతర హీరోలతో పరిమిత బడ్జెట్ లో నిర్మిస్తున్నాడు. అవసరం అనుకుంటే వాటిలో గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు. కానీ తన మీద మాత్రం పెట్టుబడి పెట్టుకోవడం లేదు. పెడితే నష్టాలు వస్తాయి? అన్న భయమో? లేక ఇంకేవైనా కారణా లు ఉన్నాయా? అన్నది తెలియాలి. అలాగే కెరీర్ ఆరంభంలో ఇతర భాషల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించేవాడు. ఇప్పుడు ఆ తరహా పాత్రలు కూడా రావడం లేదు. మరి వస్తున్నా? తానే వద్దంటున్నాడా? అన్నది తెలియదు. ప్రత్యేకించి `బాహుబలి` రిలీజ్ అనంతరం ఇతర భాషల్లో రానా పేరు వినిపించలేదు.
వాటికి పుల్ స్టాప్ ఎప్పుడు?
దీంతో రానా కెరీర్ ఎంత స్లోగా ఉందన్నది? క్లియర్ గా అర్దమవుతుంది. ఇంకొంత కాలం ఇలాగే కొనసాగితే మార్కెట్ పై మరింత ప్రభావం పడుతుంది. ఇప్పటికే అవకాశాలు లేని స్టార్ గా వైరల్ అవుతున్నాడు. నిర్మాణంలో బిజీ అవ్వడంతో ఇక అలాగే కొనసాగుతాడా? అన్న సందేహాలు నెట్టింట వ్యక్తమవుతున్నాయి. మరి అవకాశాలు అందుకుని వీటికి పుల్ స్టాప్ పెడతాడా? ఇలాగే కొనసాగిస్తాడా? అన్నది చూడాలి.
