కల్కి ఇంపాక్ట్ తర్వాత ప్రశాంత్ వర్మ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమయిన 'జై హనుమాన్' ప్రాజెక్ట్ కి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
By: M Prashanth | 27 July 2026 3:30 PM ISTఇండియన్ సినిమా రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో మైథాలజికల్ కాన్సెప్ట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన పురాణాల్లోని క్యారెక్టర్లను నేటితరం డైనమిక్ స్క్రీన్ ప్లేకి అనుగుణంగా ప్రెజెంట్ చేయడానికి ఫిల్మ్ మేకర్లు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమయిన 'జై హనుమాన్' ప్రాజెక్ట్ కి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బిగ్ కాన్వాస్ సినిమాలో రానా దగ్గుబాటి ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారని, ఆయన అశ్వత్థామ క్యారెక్టర్ చేయనున్నారని రూమర్స్ వస్తున్నాయి.
ఇప్పటికే 'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ చేసిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో అందరూ చూశారు. ఆరడుగుల బుల్లెట్ లాంటి బాడీ లాంగ్వేజ్, బేస్ వాయిస్ తో అమితాబ్ ఆ పాత్రకు ప్రాణం పోశారు. దీంతో ఆడియన్స్ మైండ్ లో అశ్వత్థామ అనగానే ఒక స్ట్రాంగ్, విజువల్ గా ఇంపాక్ట్ ఇచ్చే రాయల్ ఇమేజ్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు అదే క్యారెక్టర్ షేడ్స్ ను లేదా అంతటి పవర్ ఉన్న క్యారెక్టర్ ను 'జై హనుమాన్' లో చూపించాల్సి వస్తే, దానికి రానా కంటే బెస్ట్ ఆప్షన్ మరోకటి ఉండదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రానా దగ్గుబాటి స్క్రీన్ ప్రజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలిలో భల్లాలదేవుడిగా ఆయన చూపించిన ఆరా, నెగిటివ్ షేడ్స్ లో కూడా పండించిన రాయల్ లుక్స్ ఇండియన్ వైడ్ ఆడియన్స్ కు బాగా గుర్తుండిపోయాయి. ఎలాంటి హెవీ క్యారెక్టర్ నైనా తన పర్సనాలిటీతో ఈజీగా హోల్డ్ చేయగల కెపాసిటీ రానాకు ఉంది. అందుకే ప్రశాంత్ వర్మ డిజైన్ చేస్తున్న డివైన్ వరల్డ్ లో రానా లాంటి పెర్ఫార్మర్ ఉంటే, ఆ క్యారెక్టర్ కి ఇచ్చే ఎలివేషన్ వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పవచ్చు.
కటౌట్ మాత్రమే కాకుండా, పురాణ పాత్రలకు అవసరమైన గంభీరమైన వాయిస్, డైలాగ్ డెలివరీ రానా దగ్గర పుష్కలంగా ఉన్నాయి. మైథాలజీ నేపధ్యం ఉన్న సినిమాల్లో నటీనటుల బాడీ లాంగ్వేజ్ చాలా కీలకం. రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండటంతో, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కు తగ్గట్టుగా నిలబడగల మరొక బలమైన క్యారెక్టర్ కథకు అవసరం. ఈ కాంబినేషన్ కు రానా కచ్చితంగా న్యాయం చేయగలరనే నమ్మకం ఫ్యాన్స్ లో వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న 'జై హనుమాన్' లో రానా ఎంట్రీ ఇస్తే, ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు బాక్సాఫీస్ క్రేజ్ కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను విజువల్ గా చాలా రిచ్ గా ప్రెజెంట్ చేయడానికి సిద్ధమవుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయిస్తూ ప్రాజెక్ట్ ను పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తున్నారు. అయితే రానా నటిస్తున్నారనే వార్తలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు మాత్రం సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
