నీలాంబరి మొదటి ఛాయిస్ వాళ్లిద్దరా?
కానీ రవి కుమార్ సన్నివేశం పండించడం కోసం ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా ఛాన్స్ తీసుకున్నారు.
By: Srikanth Kontham | 15 Aug 2025 9:25 AM ISTనీలాంబరి పాత్రతో రమ్యకృష్ణ కు వచ్చిన గుర్తింపు గురించి చెప్పాల్సిన పనిలేదు. `నరసింహ`లో లేడీ విలనీ నిలాంబరి పాత్ర రమ్యకృష్ణ కెరీర్ లో ఓ గొప్ప పాత్రగా నిలిచిపోయింది. అప్పటి వరకూ సాప్ట్ పాత్రలతో అలరించిన రమ్యకృష్ణలో నీలాంబరి కోణాన్ని చూసిన రవికుమార్ ఆ పాత్రకే వన్నే తీసుకొ చ్చారు. సినిమా లో ఆ పాత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ రోల్ కు ధీటుగా ఉంటుంది. సౌందర్య చెంపపై కాలు వేసే సీన్ సిని మాకే హైలైట్. ఇద్దరు బలమైన నాయికల విషయంలో ఏ డైరెక్టర్ ఇలాంటి ఛాన్స్ తీసుకోడు.
కానీ రవి కుమార్ సన్నివేశం పండించడం కోసం ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా ఛాన్స్ తీసుకున్నారు. ఈ విషయంలో అంతే దైర్యంగా నటించింది సౌందర్య. అయితే ఈ సన్నివేశంలో నటించడానికి రమ్యకృష్ణ ఎంతో మధన పడింది. తోటి నటితో అలాంటి సన్నివేశం చేయాలంటే? మనసు రాలేదు. మన సు చంపుకునే ఆ సన్నివేశంలో నటించారు. ఈ విషయంలో సౌందర్య అందించిన గొప్ప సహకారంతోనే సాధ్యమైంది. రమ్యకృష్ణ ఆ సీన్ లో నటించనంటే? సౌందర్య రమ్యకృష్ణ కాలు తీసుకుని చెంప మీద పెట్టుకుని నటించమని కోరింది.
ఆ కారణంగానే రమ్యకృష్ణ సాహసించింది. అయితే తొలుత నీలాంబరి పాత్ర కోసం రమ్యకృష్ణను అనుకో లేదు అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని దర్శకుడు రవికుమార్ రివీల్ చేసారు. ఆ పాత్రలో మీనాను తీసుకోవాలనుకున్నారుట. ఆమె సంప్రదింపులు కూడా జరిపారు. కానీ మీనా ముఖంలో పసితనం గమనించి..ఆ పాత్రకు తాను న్యాయం చేయలేదని భావించి ఆలోచన మార్చు కున్నారు.
అనంతరం అదే పాత్రకు నగ్మతోనూ సందప్రదింపులు జరిపారుట. అదే సమయంలో రమ్యకృష్ణ పేరు కూడా మెదలడంతో మరింత పర్పెక్షన్ ఉంటుందని రమ్యని తీసుకున్నట్లు తెలిపారు. ఆ పాత్రకు యాటి ట్యూడ్ కూడా అంతే అవసరమని భావించి మరో ఆలోచన లేకుండా రమ్యకృష్ణను ఫైనల్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నరసింహ స్టైల్లోనే ఆ సినిమాకు సీక్వెల్ కూడా చేస్తే బాగుంటుందని కొంత కాలంగా రజనీ అభిమానులు కోరుతున్నారు. కానీ రవి కుమార్ మాత్రం అందుకు ఎలాంటి బధులివ్వలేదు.
