పట్టుచీరలో రమ్య.. రాయల్ లుక్‌తో అదరగొట్టింది!
సోషల్ మీడియా, వెబ్ సిరీస్‌ల ద్వారా యూత్‌కు బాగా కనెక్ట్ అయిన బ్యూటీ రమ్య పసుపులేటి.
By: M Prashanth | 5 Nov 2025 11:00 PM ISTసోషల్ మీడియా, వెబ్ సిరీస్‌ల ద్వారా యూత్‌కు బాగా కనెక్ట్ అయిన బ్యూటీ రమ్య పసుపులేటి. పాపులర్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ, ఇప్పుడు మెల్లగా సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫొటోషూట్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంటుంది.
లేటెస్ట్ గా రమ్య షేర్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్‌ను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందమైన పట్టుచీరలో, దానికి తగినట్లుగా హెవీ జ్యువెలరీ ధరించి అచ్చం తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోయింది. ఈ ఫొటోలకు ఓ ప్రత్యేకత ఉంది.. ఇది తన 'అమ్మ పెళ్లి చీర' అంటూ క్యాప్షన్‌లో పేర్కొంది. ఈ రాయల్ లుక్‌లో రమ్య అందం, హుందాతనం చూసి ఫ్యాన్స్ ముగ్ధులవుతున్నారు.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రమ్య, ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో నటించి పాపులర్ అయింది. ముఖ్యంగా యూత్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకులకు దగ్గరై, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్కు, నటనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వెబ్ సిరీస్‌ల నుంచి వెండితెరపైకి అడుగుపెట్టిన రమ్య, 'హుషారు', 'ఫస్ట్ డే ఫస్ట్ షో' వంటి చిత్రాలలో కొన్ని ముఖ్యమైన పాత్రల్లో కనిపించింది.
నటిగా ఇండస్ట్రీలో పెద్ద బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ, నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటూ నిలదొక్కుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం రమ్య ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అటు ట్రెడిషనల్ లుక్స్‌లో, ఇటు మోడ్రన్ అవుట్ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ.. తన ఫాలోవర్స్‌కు నిత్యం టచ్‌లో ఉంటుంది. తన అందంతో, స్టైల్‌తో తన క్రేజ్‌ను ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటోంది.
