Begin typing your search above and press return to search.

రెండు క‌ళ్లు మూసుకున్నా.. లాగు మ‌రి నీ వైపు!

రమ్య పసుపులేటి.. పేరుకు త‌గ్గ‌ట్టే అందం అభిన‌యంతో ఆక‌ట్టుకున్న నేటిత‌రం తెలుగమ్మాయి.

By:  Sivaji Kontham   |   5 Sept 2025 11:25 PM IST
రెండు క‌ళ్లు మూసుకున్నా.. లాగు మ‌రి నీ వైపు!
X

రమ్య పసుపులేటి.. పేరుకు త‌గ్గ‌ట్టే అందం అభిన‌యంతో ఆక‌ట్టుకున్న నేటిత‌రం తెలుగమ్మాయి. 2018లో హుషారు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ కమిట్‌మెంట్ (2020), పంచాక్షరి (2019), (MAD)² (2024), మారుతి నగర్ సుబ్రమణ్యం లాంటి చిత్రాల‌లో న‌టించింది. వెబ్ సిరీస్ BFFలోను త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ప‌లు వాణిజ్య‌ ప్రకటనలలో కనిపించింది. డిజిట‌ల్ మాధ్య‌మాల్లో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది.


ర‌మ్య ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం అభిమానుల‌ను ఎంత‌గానో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. త‌న‌ నటనా వృత్తికి మించి రమ్య పసుపులేటి ఒక స్పెష‌లిస్ట్ ఫ్యాషన్ బ్లాగర్.. సోషల్ మీడియా ప‌ర్స‌నాలిటీ. నేటిత‌రానికి స్ఫూర్తినిచ్చే ఫ్యాషన్ కంటెంట్ సృష్టిక‌ర్త‌. ర‌మ్య‌ ఫ్యాషన్ కంటెంట్ దక్షిణ భారతదేశం అంతటా యూత్‌ కు స్ఫూర్తి.


ర‌మ్య ఫ్యాష‌న్ సెన్స్ ట్రెడిష‌న్ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌వి. తాజాగా ఇన్ స్టా మాధ్య‌మంగా ర‌మ్య ప‌సుపులేటి షేర్ చేసిన శారీ లుక్ వైర‌ల్ గా దూసుకెళుతోంది. వాలు క‌నుల‌తో మాయ చేస్తున్న ఈ బ్యూటీ, చీర‌లో ముగ్ధ‌మ‌నోహ‌ర రూపంతో క‌ట్టి ప‌డేస్తోంది. ``రెండు క‌ళ్లు మూసుకున్నా.. లాగు మ‌రి నీ వైపు!`` అనే క్యాప్షన్ తో టీజ్ చేసింది రమ్య‌. ఈ బ్యూటీ తదుప‌రి ప్రాజెక్టుల గురించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.