Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. రెండు వారాలకు చిట్టి పికిల్స్ రమ్య రెమ్యునరేషన్ ఎంత..?

బిగ్ బాస్ సీజన్ 9లో చిట్టి పికిల్స్ రమ్య మొదటి నుంచి వార్తల్లో ఉంది. ఆమెను ముందు సీజన్ మొదట్లోనే పంపిస్తారని అనుకోగా వైల్డ్ కార్డ్ గా పంపించారు.

By:  Ramesh Boddu   |   27 Oct 2025 1:38 PM IST
బిగ్ బాస్ 9.. రెండు వారాలకు చిట్టి పికిల్స్ రమ్య రెమ్యునరేషన్ ఎంత..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో చిట్టి పికిల్స్ రమ్య మొదటి నుంచి వార్తల్లో ఉంది. ఆమెను ముందు సీజన్ మొదట్లోనే పంపిస్తారని అనుకోగా వైల్డ్ కార్డ్ గా పంపించారు. సోషల్ మీడియాలో కాంట్రవర్సీ తో వార్తల్లో నిలిచిన రమ్య మోక్ష సీజన్ 9లో వైల్డ్ కార్డ్ గా వచ్చి కేవలం రెండు వారాల్లోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఐతే రమ్య ఎందుకు ఇంత సడెన్ గా ఎలిమినేట్ అయ్యింది అంటే.. ఆమె వెనక మాటలే ఇందుకు కారణం అన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు స్ట్రాంగ్ గా తన ఆట కొనసాగిస్తున్న తనూజ మీద లేని పోని అలిగేషన్స్ వేయడం కూడా ఆడియన్స్ కు నచ్చలేదు.

రమ్య ఆమెను టార్గెట్ చేయడం కూడా..

రమ్య మోక్ష మొదటి వారమే హౌస్ లో తనూజ, కళ్యాణ్, రీతు గురించి వాళ్లతో కాకుండా వేరొకరితో అభ్యంతరకరంగా మాట్లాడింది. ఇక వీకెండ్ నాగార్జున కన్ ఫెషన్ రూం లోకి పిలిచి వీడియోస్ చూపించారు. అది చాలదు అన్నట్టుగా తనూజ మీద ఆమె నామినేషన్స్ వేసే టైంలో రిలేషన్స్ కోసం వచ్చావ్.. ఫేక్ పిల్ల అంటూ ఏదేదో మాట్లాడింది. ఆల్రెడీ హౌస్ లో తనూజ మొదటి వారం నుంచి ఆట ఆడుతూ కొంత ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇప్పుడు రమ్య అలా ఆమెను టార్గెట్ చేయడం కూడా ఆడియన్స్ కి నచ్చలేదు.

ఇక రెండు వారాలు హౌస్ లో ఉన్న రమ్య మోక్ష వారానికి 2 నుంచి 3 లక్షల దాకా రెమ్యునరేషన్ అందుకుందట. అంటే రెండు వారాలకు మొత్తంగా 5 లేదా 6 లక్షల దాకా రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది. ఉన్నది 2 వారాలే అయినా రమ్య వెళ్లేప్పుడు మాధురి ఎమోషనల్ అయ్యారు. మరి వారి మధ్య బాండింగ్ ఏంటన్నది ఆడియన్స్ కి తెలియలేదు. హౌస్ లో ఆట, మాట రెండు బాగుండాలి. ఐతే రమ్య వాయిస్ బాగున్నా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టలేకపోవడం వల్ల ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

బిగ్ బాస్ ఛాన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రమ్య ..

బిగ్ బాస్ ఛాన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రమ్య మోక్ష కేవలం రెండు వారాల్లోనే తన ఆట ముగించడం ఆశ్చర్యకరంగా ఉంది. ఐతే హౌస్ లో ఆమె బాండింగ్ వద్దు అనుకుంటూ వేరే వాళ్ల బాండింగ్ గురించి గుస గుస లాడటం ఆడియన్స్ కు నెగిటివ్ గా వెళ్లింది. ఫైనల్ గా రమ్య మోక్ష బిగ్ బాస్ జర్నీ ముగిసింది. తను ఎలిమినేట్ అయ్యి వెళ్లేప్పుడు రీతు వారం పాటు వాష్ రూమ్ క్లీనింగ్ చేయాలని బిగ్ బాంబ్ వేసింది.

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం అయేషా హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్లింది. రమ్య కూడా ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో కంటెస్టెంట్స్ తగ్గుతున్నారని తెలిసి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ లో ఒకరిద్దరు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది.