Begin typing your search above and press return to search.

క్యాస్టింగ్ కౌచ్ ఉంది..దీనికి లింగభేదం లేదు!

సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది వాస్తవమని సీనియర్ నటి రమ్యకృష్ణ అన్నారు. ఈ వేధింపులకు లింగభేదం లేదని, మహిళలు, పురుషులు ఇద్దరూ ఎదుర్కొంటున్నారని ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. కాలానికి అనుగుణంగా వేధింపుల తీరు మారుతున్నా, గతంలోనూ, ఇప్పుడూ ఈ సమస్య ఉందని స్పష్టం చేశారు.

By:  Srikanth Kontham   |   17 Nov 2026 12:21 PM IST
క్యాస్టింగ్ కౌచ్ ఉంది..దీనికి లింగభేదం లేదు!
X

పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంటుంది. కొందరు నటీనటులు అసలు ఇండస్ట్రీలో అలాంటివి లేవని కొట్టిపారేస్తుంటే? మరికొందరు తమకెదురైన చేదు అనుభవాలను బయట పెడుతుంటారు. తాజాగా సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ అంశంపై స్పందించారు. ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమేనని.. దాన్ని ఎవరూ కాదనలేరన్నారు. ఈ దోపిడీకి లింగభేదం కూడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ వేధింపుల ఉదంతాన్ని ప్రస్తావించారు.

మహిళలు స్వతంత్రంగా.. ఫార్వర్డ్‌గా ఉండే అమెరికా లాంటి దేశాల్లోనే ఇలాంటి దారుణాలు జరిగాయని అలాంటప్పుడు మన దగ్గర జరగడం లేదని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. గ్లామర్ ఫీల్డ్ కావడంతో ఇండస్ట్రీలో జరిగే విషయాలు బయటకు ఎక్కువగా చర్చకొస్తాయ‌ని..కానీ బయట సాధారణ రంగాల్లో కూడా ఎంతోమంది మహిళలు.. పురుషులు ఇలాంటి వేధింపులను ఎదుర్కొం టున్నారన్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది గతంలో జరిగింది. ఇప్పుడు జరుగుతోంది. భవిష్యత్తులోనూ జరుగుతూనే ఉంటుందని రమ్యకృష్ణ కుండబద్దలు కొట్టారు.

అయితే కాలానికి తగినట్లుగా వేదింపు తీరు మారుతుందని బలవంతంగానో? ఇష్టపూర్వకంగానో ? కొనసా గుతోం దన్నారు. ర‌మ్య‌కృష్ణ వ్యాఖ్య‌ల‌తో కాస్టింగ్ కౌచ్ నిజంగానే ఉందా? అన్న సందేహం మ‌రోసారి అంద‌రి నోట వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌తంలోనూ చాలా మంది సీనియ‌ర్ న‌టీమ‌ణులు వేధింపులున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ తెలుగు సినిమాల్లో న‌టించిన పేరున్న న‌టీమ‌ణులు మాత్రం ఈ అంశంపై ఎక్కువ‌గా భిన్న వాదన‌లు వినిపించారు. కానీ ర‌మ్య‌కృష్ణ మాత్రం ఎంతో ఓపెన్ గా ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితులు ఇలా ఉంటాయ‌ని ఎంతో ఓపెన్ గా మాట్లాడం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇక న‌టిగా సీనియ‌ర్ బ్యూటీ సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌లే రిలీజ్ అయిన `జైల‌ర్ 2` లో కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ర‌జ‌నీకాంత్ భార్య పాత్ర‌క‌లో న‌టించారు. ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌తో దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న గ్లోబ‌ల్ ప్రాజెక్ట్ `రాకా` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే `శ్రీ శ్రీ` అనే ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. వీటితో పాటు త‌మిళ్ లోనూ రెండు..మూడు సినిమాల‌కు క‌మిట్ అయ్యారు.