బాహుబలి: శ్రీదేవి తప్పుకోవడం పై రమ్యకృష్ణ కామెంట్స్!
సీనియర్ నటి రమ్యకృష్ణ ఐదు పదుల వయసులో కూడా ఇంకా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.
By: Madhu Reddy | 26 Oct 2025 4:00 PM ISTసీనియర్ నటి రమ్యకృష్ణ ఐదు పదుల వయసులో కూడా ఇంకా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇప్పటికే చాలామంది నటీమణులు అవకాశాలు తగ్గడంతో పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతున్నారు. కానీ రమ్యకృష్ణ మాత్రం హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక కూడా తల్లి, అత్త పాత్రలు చేస్తూ సినిమాల్లో రాణిస్తోంది. ఇదిలా ఉండగా రమ్య కృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా చేసిన బాహుబలి సినిమాతో ఆమె కెరియర్ మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రమ్యకృష్ణ శివగామి అనే పవర్ఫుల్ రోల్ పోషించింది. అయితే మొదట ఈ శివగామి పాత్రకి దర్శకులు రాజమౌళి శ్రీదేవిని అనుకున్న సంగతి మనకు తెలిసిందే. కానీ శ్రీదేవి ఆ పాత్రను వదులుకోవడంతో రమ్యకృష్ణ ఆ పాత్ర పోషించి భారీ సక్సెస్ అందుకుంది.
అయితే తాజాగా జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోలో జగపతిబాబు శివగామి పాత్రని మిస్ చేసుకున్న శ్రీదేవి గురించి ఓ ప్రశ్న అడిగారు. శివగామి పాత్రని శ్రీదేవి పోషించాల్సింది. కానీ ఆమె చేయాల్సిన పాత్రలో మీరు నటించారు. దీని గురించి మీ స్పందన ఏంటి అని జగపతిబాబు అడగగా.. "ఏమో ఈ విషయం గురించి నాకు కూడా తెలియదు. కానీ శివగామి పాత్ర పోషించడం అనేది నా అదృష్టం.బాహుబలి సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడప్పుడు జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి.అలా నా జీవితంలో బాహుబలి సినిమా ఓ అద్భుతం" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది రమ్యకృష్ణ..
అయితే ఇదే టాక్ షోలో బాహుబలి నిర్మాత అయినటువంటి శోభు యార్లగడ్డ కూడా పాల్గొన్నారు. ఇందులో శివగామి పాత్ర గురించి మాట్లాడుతూ.. "శివగామి పాత్రలో రమ్యకృష్ణ తప్ప వేరేకరిని ఊహించుకోలేము.ఆ పాత్ర రమ్యకృష్ణకు రావడం డెస్టినీ.. ఈ పాత్రలో రమ్యకృష్ణ తప్ప మరొకరు చేయలేరని నా అభిప్రాయం" అన్నట్లుగా స్పందించారు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2 రెండు సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ ని మార్చేశాయి. ఈ సినిమాలో ప్రభాస్,రానా,అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, అడివి శేష్ లు కీ రోల్స్ పోషించారు.
అయితే ఈ సినిమాలో శివగామి అనే పవర్ఫుల్ రోల్ రమ్యకృష్ణ పోషించింది.కానీ శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని అనుకున్నారు. కానీ శ్రీదేవి అడిగిన రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉండడంతో రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపించాయి. శ్రీదేవి పెట్టిన కండిషన్స్, డిమాండ్ల వల్లే ఆమెను సినిమా నుండి తీసేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ శ్రీదేవి మాత్రం ఈ వార్తలపై స్పందించి నేను ఎక్కువ రెమ్యూనరేషన్ అడగలేదు. అలాగే ఆ వార్తలన్నీ అవాస్తమని ఖండించింది. దర్శక నిర్మాతలకి,శ్రీదేవికి మధ్య వచ్చిన అపార్ధాల కారణంగానే ఆ పాత్రలో శ్రీదేవి నటించలేకపోయింది.కానీ శివగామి పాత్రలో శ్రీదేవి కంటే రమ్యకృష్ణ నే బాగా సెట్ అయింది.ఈ పాత్రలో శ్రీదేవిని తీసుకుంటే సెట్ అయ్యేది కాదు అని ఎంతోమంది సినిమా చూశాక మాట్లాడుకున్నారు. ఇక బాహుబలి -1 బాహుబలి -2 రెండు సినిమాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రీ రిలీజ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
