సౌందర్య నాకు గట్టి పోటీ ఇచ్చింది.. రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!
దివంగత నటి సౌందర్య తనకు గట్టి పోటీ ఇచ్చిన హీరోయిన్లలో ఒకరని సీనియర్ నటి రమ్యకృష్ణ వెల్లడించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, సౌందర్య తన కళ్ల ముందే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారని గుర్తుచేసుకున్నారు. ‘నరసింహ’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడానికి తొలుత ఆలోచించినా, నటిగా తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించానని తెలిపారు.
By: Priya Chowdhary Nuthalapti | 19 Nov 2026 11:30 AM ISTతెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల మధ్య పోటీ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి హీరోయిన్ ప్రయత్నించేవారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్స్ తనకు గట్టి పోటీ ఇచ్చారని సీనియర్ నటి రమ్యకృష్ణ వెల్లడించారు.
ముఖ్యంగా దివంగత నటి సౌందర్య గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రమ్యకృష్ణ తన సినీ ప్రయాణం, అప్పటి హీరోయిన్ల గురించి, సౌందర్యతో తన అనుబంధం గురించి పలు విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా సౌందర్య గురించి మాట్లాడుతూ.. ఆమెపై ప్రశంసలు కురిపించారు. సౌందర్య తన కళ్ల ముందే ఎదిగిన హీరోయిన్ అని రమ్యకృష్ణ గుర్తు చేసుకున్నారు. తనతో సమానంగా సినిమాల్లో కొనసాగుతూ, క్రమంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన విధానాన్ని దగ్గర నుంచి చూశానని చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే సౌందర్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పుకొచ్చాడు.
సినిమా పరిశ్రమలో పోటీ సహజమని రమ్యకృష్ణ పేర్కొన్నారు. తన కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్లను చూశానని, వారిలో కొందరు క్రమంగా ఎదుగుతూ మాయమైపోయారని. మరికొందరు తనకు గట్టి పోటీ ఇచ్చారని వెల్లడించారు. అలాంటి వారిలో సౌందర్య ఒకరని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అంతేకాదు నరసింహ సినిమా సమయంలో తన పాత్ర విషయంలో కూడా కొన్ని ఆలోచనలు వచ్చినట్లు రమ్యకృష్ణ తెలిపారు. ఆ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయాలా వద్దా అని మొదట ఆలోచించానని చెప్పారు. అయితే ఒకసారి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత మాత్రం తన పూర్తి ప్రతిభను చూపించడానికి ప్రయత్నించేదాన్నని వివరించారు. పాత్ర ఎలాంటిదైనా నటిగా తన వంతు బాధ్యతను పూర్తిగా నిర్వర్తించేదాన్నని తెలిపారు.
