వర్మ ఇక అలా సెటిలవ్వడం ఉత్తమం!
రాంగోపాల్ వర్మకు డైరెక్టర్ గా కొంత కాలంగా సరైన సక్సెస్ లు లేవు. ఆయన డైరెక్షన్ ఏమంతా సీరియస్ గానూ చేస్తున్నట్లు కనిపించలేదు.
By: Srikanth Kontham | 6 Dec 2025 1:28 PM ISTరాంగోపాల్ వర్మకు డైరెక్టర్ గా కొంత కాలంగా సరైన సక్సెస్ లు లేవు. ఆయన డైరెక్షన్ ఏమంతా సీరియస్ గానూ చేస్తున్నట్లు కనిపించలేదు. చివరిగా రెండున్నరేళ్ల క్రితం `వ్యూహం` చిత్రాన్ని రిలీజ్ చేసాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మరో రిలీజ్ లేదు. బాలీవుడ్ లో `పోలీస్ స్టేషన్ మెయిన్ బూట్` అనే ఓ సినిమా చేస్తున్నాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో గ్యారెంటీ లేదు. ఆ సినిమా మొదలైన నాటి నుంచి మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. రైటర్ గా , నిర్మాతగా కూడా మునుపటి అంత చురుకుగా పని చేయడం లేదు. ప్రస్తుతం ఆయన వయసు కూడా ఆరు పదులు దాటింది.
ఓ మంచి స్నేహితుడితో వర్మ:
63 లో కొనసాగుతున్నారు. మరి క్రియేటివ్ గా వయో భారం ప్రభావం చూపిస్తుందా? అన్నది పక్కన బెడితే? నటుడిగా మాత్రం వర్మ ఇంత వరకూ వెండి తెరపై కనిపించలేదు. రెండు..మూడు చిత్రాల్లో ఇలా వచ్చి అలా కనిపించి వెళ్లిపోయే పాత్రలు మినహా పట్టుమని పది నిమిషాలు కనిపించే రోల్ ఏ సినిమాలోనూ చేయలేదు. అయితే `షో మ్యాన్` అనే సినిమాతో వర్మ నటుడిగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. నూతన్ అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేస్తున్నాడు. శతాధిక చిత్రాల నిర్మాత రామ సత్యానారాయణ నిర్మిస్తున్నారు. ఈయనతో వర్మ అనుబంధం ఈనాటిది కాదు.
గ్యాంగ్ స్టర్లకే గ్యాంగ్ స్టర్ ఈయన:
చాలా కాలంగా ఇద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. కష్ట కాలంలో వర్మకు డైరెక్టర్ గా ఛాన్సులు ఇచ్చిన నిర్మాత కూడా ఈయనే. ఇప్పుడు ఆయన బ్యానర్లోనే వర్మ నటుడిగా మ్యాకప్ వేసుకోవడం విశేషం. ఇదీ గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న చిత్రం. ఇలాంటి కథలు రాయుడం అన్నా..తీయడం అన్నా వర్మకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి టైటిల్ పాత్రలో వర్మ ఒదిగిపోతాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి కానుకగా ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. వర్మ ఆ పాత్రకు సెట్ అయ్యాడా? సినిమా ఎలా ఉంటుంది? అన్న దానిపై ట్రైలర్ రిలీజ్ అనంతరం ఓ క్లారిటీ వస్తుంది.
అభిమానులు చిరకాల కోరిక:
అయితే వర్మ ఇలా నటుడు అవ్వడం చూసి సెకెండ్ ఇన్నింగ్స్ ఇలా కొనసాగిస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. వివాదాస్పద డైరెక్టర్ గా ఆయనకున్న ఇమేజ్ నటుడిగా కూడా కలిసొస్తుందని అభిప్రాయ పడుతున్నారు. ఇంత కాలంక్రియేటివ్ రంగంలో ఉన్న వర్మ నటుడిగా బిజీ అయితే చూడాలని ఉందని..ఆయన నుంచి మరిన్ని అద్బుతాలు ఆశించొచ్చు అని భావిస్తున్నారు. మరి వర్మ మనసులో ఏముందో.
