రామ్ చరణ్ కి జోడీగా సీతమ్మ!
ఈ నేపథ్యంలో సుకుమార్ కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆర్సీ 17 ప్రకటించడంతో కొన్ని రోజులుగా సుకుమార్ ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు.
By: Srikanth Kontham | 20 Sept 2025 11:52 AM ISTరామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న `పెద్ది` షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటోంది. చిత్రీకరణ మొదలైన నాటి నుంచి విరామం లేకుండానే పని చేయడంతో? షూటింగ్ ఎక్కడా డిస్టర్బ్ కాలేదు. ఈ నెలాఖరుకల్లా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చేస్తుంది. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆర్సీ 17 ప్రకటించడంతో కొన్ని రోజులుగా సుకుమార్ ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు. తాజాగా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసారు.
`పెద్ది` పూర్తయిన వెంటనే పట్టాలెక్కించాల్సిన నేపథ్యంలో? పనులు వేగవంతం చేసారు. అయితే సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంత వరకూ ఖరారు కాలేదు. టెక్నికల్ టీమ్ వరకూ సుకుమార్ పెద్దగా వర్కౌట్ చేయాల్సిన పనిలేదు. తన పాత టీమ్ ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. డీవోపీ, సంగీత దర్శకుల విషయంలో ఆయన కొత్తవాళ్లను వెతుక్కోవాల్సిన పనిలేదు. ఆ ఇద్దరు సుకుమార్ కు అన్ని రకాలుగా అండగా నిలబడతారు. అక్కడే సుకుమార్ కి సగం పని పూర్తయిపోతుంది. తాను నమ్మిన అసిసెంట్లు, అసోసియేట్ డైరెక్టర్లు అంతే కమిట్ మెంట్ తో పని చేస్తారు.
ఆ రకంగా బ్యాకెండ్ లో సుకుమార్ కి మంచి టెక్నికల్ టీమ్ ఉంది. మరి సినిమాలో హీరోయిన్ సంగతేంటి? అంటే బాలీవుడ్ నటి కృతిసనన్ ని ఎంపిక చేసే ఆలోచన లో ఉన్నట్లు లీకైంది. సుకుమార్ రాసిన హీరోయిన్ పాత్రకు కృతి సనన్ పర్పెక్ట్ గా సూటువుతందని..తన మీద మళ్లీ ప్రత్యేకంగా ఫోటో షూట్..ఆడిషన్ లాంటివి చేయకుండానే ఎంపిక చేయోచ్చని భావిస్తున్నారట. గతంలో సుకుమార్ తో పని చేసి అనుభవం కృతి సనన్ కి ఉంది. మహేష్ హీరోగా నటించిన `వన్` సినిమాలో ఈ భామనే హీరోయిన్. టాలీవుడ్ లో డెబ్యూ చిత్రమిదే.
కానీ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. అటుపై కృతి మరో రెండు..మూడు తెలుగు సినిమాలు చేసి బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మళ్లీ తెలుగు సినిమా వైపు చూడలేదు. మళ్లీ సుకుమార్ కారణంగానే టాలీవుడ్ లో సెకెండ్ ఛాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. మరి తుదిగా ఆ ఛాన్స్ తనకే సొంతమవుతుందా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా ఉంది. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది.
