ఆ ఫాలోయింగ్ వెనుక కారణమేంటి?
అయితే ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి చాలానే టైమ్ పడుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 9 Nov 2025 2:15 PM ISTప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా ఎక్కువైపోయింది. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియాను వాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో సోషల్ మీడియా మాధ్యమాన్ని వాడుతూ టెక్నికల్ గా అప్డేట్ అవుతున్నారు. కాలంతో పాటూ మనం కూడా మారాలని అందరూ ప్రయత్నిస్తుండగా, సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారానే తమకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు.
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా దాన్ని వెంటనే సంచలనం చేస్తూ నెట్టింట వైరల్ చేస్తుంటారు నెటిజన్లు. ఇప్పుడు అలాంటి ఓ విషయాన్నే నెటిజన్లు పసిగట్టారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రీసెంట్ గా ఒకరినొకరు ఇన్‌స్టా లో ఫాలో అవడం మొదలుపెట్టారనే విషయాన్ని నెటిజన్లు గుర్తించగా, ఈ న్యూస్ ఫ్యాన్స్ లో సెన్సేషన్ ను సృష్టించింది.
దీంతో సందీప్, రామ్ చరణ్ కలయికలో త్వరలోనే సినిమా వస్తుందని, బహుశా అందుకే వీరిద్దరూ ఒకరినొకరు ఇప్పుడు ఫాలో అవుతున్నారని అంటూ ఎవరి వార్తలు వారు సృష్టిస్తున్నారు. అయితే వీరిద్దరి కలయికలో సినిమా వచ్చే అవకాశాలున్నాయని గతంలోనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ ఇలా ఇన్‌స్టాలో ఫాలో అవుతుండటం ఆ వార్తలకు ఆజ్యం పోస్తుంది.
పలు సినిమాలతో చరణ్, సందీప్ బిజీ
అయితే ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి చాలానే టైమ్ పడుతుంది. ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్న గ్లోబల్ స్టార్ చరణ్, ఆ తర్వాత సుకుమార్ తో కలిసి సినిమా చేయనున్నారు. ఆ సినిమా పూర్తవడానికి బాగానే టైమ్ పడుతుంది. మరోవైపు సందీప్ కూడా ప్రభాస్ తో స్పిరిట్ చేయాలి, ఆ తర్వాత యానిమల్ పార్క్ చేయాల్సి ఉంది. ఈ రెండింటికీ సందీప్ కు కూడా టైమ్ పట్టనుంది. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా సెట్ అయినా అది సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇంకా టైముంది.
