Begin typing your search above and press return to search.

పెద్ది వీడియో సాంగ్: చికిరి చికిరి.. చరణ్ స్టెప్పుల కోసం మళ్ళీ మళ్ళీ చూసేలా..

తాజాగా ఈ సినిమా నుంచి "చికిరి చికిరి" అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మరి ఈ పాట ఆ అంచనాలను అందుకుందా లేదా అనే వివరాల్లోకి వెళితే..

By:  M Prashanth   |   7 Nov 2025 12:00 PM IST
పెద్ది వీడియో సాంగ్: చికిరి చికిరి.. చరణ్ స్టెప్పుల కోసం మళ్ళీ మళ్ళీ చూసేలా..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా ఆల్బమ్‌పై మొదటి నుంచి గై రేంజ్ లో అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి "చికిరి చికిరి" అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మరి ఈ పాట ఆ అంచనాలను అందుకుందా లేదా అనే వివరాల్లోకి వెళితే..

ఈ పాటను మేకర్స్ రూరల్ బీట్స్, పాన్ వరల్డ్ వైబ్.. అంటూ ఆసక్తికరంగా ప్రమోట్ చేశారు. అంటే, పక్కా పల్లెటూరి సంగీతానికి, అంతర్జాతీయ స్థాయి ఫీల్‌ను జోడించారన్నమాట. ఈ పాట ద్వారా 'పెద్ది' ప్రపంచం ఎంత పచ్చిగా, వాస్తవికంగా ఉండబోతుందో బుచ్చిబాబు ఒక చిన్న జలక్ ఇచ్చారు. పాట వినగానే ఇది రెగ్యులర్ కమర్షియల్ బీట్ కాదని అర్ధమవుతుంది.

"ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే దీనక్క.. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా" అంటూ బాలాజీ రాసిన సాహిత్యం చాలా రూటెడ్‌గా, కాస్త వింతగా అనిపిస్తుంది. ఇలాంటి పక్కా జానపద స్టైల్ పాటకు మోహిత్ చౌహాన్ లాంటి సాఫ్ట్, మెలోడీ వాయిస్ ఉన్న సింగర్‌ను ఎంచుకోవడం ఏ.ఆర్. రెహమాన్ చేసిన పెద్ద ప్రయోగం. ఈ పాట వినగా వినగా నచ్చే 'స్లో పాయిజన్' తరహా ట్యూన్‌లా ఉందని మరికొందరు అంటున్నారు.

ముఖ్యంగా విజువల్స్ మాత్రం ఫ్యాన్స్‌కు అసలైన ట్రీట్. రామ్ చరణ్ పూర్తి మేకోవర్‌తో, గడ్డం, పొడవాటి జుట్టుతో చాలా రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించారు. ముఖ్యంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి చరణ్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ పాటను విజువల్‌గా మరో స్థాయికి తీసుకెళ్లాయి. చరణ్ డ్యాన్స్ కోసమే ఈ పాటను మళ్లీ మళ్లీ చూసేలా ఉంది.

హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పల్లెటూరి గెటప్‌లో, లంగావోణీలో అందంగా కనిపించింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ ఆ పల్లెటూరి వాతావరణాన్ని, కొండల నడుమ లొకేషన్లను అద్భుతంగా బంధించింది. రెహమాన్, మోహిత్ చౌహాన్‌లను పియానోతో చూపించిన షాట్స్ పాన్ వరల్డ్ వైబ్‌ను సూచిస్తున్నాయి. ఫైనల్ గా, 'చికిరి చికిరి' పాట.. ఆడియో పరంగా ఒక ప్రయోగం అయితే, విజువల్స్ పరంగా ముఖ్యంగా చరణ్ డ్యాన్స్ ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.