Begin typing your search above and press return to search.

పెద్ది.. ఇది మరో పాజిటివ్ బూస్ట్

గురువారం రిలీజైన సినిమాకు శుక్ర, శనివారాల కన్నా ఆదివారం వసూళ్లు అత్యధికంగా వస్తే అది లాంగ్ రన్ కు పాజిటివ్ బూస్ట్ ఇచ్చినట్లే అని ఇండస్ట్రీలో వినిపించే ఒక మాట.

By:  M Prashanth   |   8 Jun 2026 11:29 AM IST
పెద్ది.. ఇది మరో పాజిటివ్ బూస్ట్
X

గురువారం రిలీజైన సినిమాకు శుక్ర, శనివారాల కన్నా ఆదివారం వసూళ్లు అత్యధికంగా వస్తే అది లాంగ్ రన్ కు పాజిటివ్ బూస్ట్ ఇచ్చినట్లే అని ఇండస్ట్రీలో వినిపించే ఒక మాట. రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది సినిమా ఇప్పుడు సరిగ్గా అదే ట్రెండ్ ను బాక్సాఫీస్ దగ్గర రిపీట్ చేస్తోంది. మొదటి రెండు రోజులు పబ్లిక్ లో కాస్త పరిస్థితి అటు ఇటు ఉన్నా, సండే నాటికి సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. అంచనాలను దాటి థియేటర్ల దగ్గర జనాల రద్దీ పెరిగింది.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా నాలుగో రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 20 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ మధ్య కాలంలో పుష్ప 2, కల్కి 2898 ఏడీ లాంటి పాన్ ఇండియా రేంజ్ భారీ చిత్రాలకు మాత్రమే ఇలాంటి ఫీట్ సాధ్యమైంది. ఇప్పుడు ఆ రెండు బడా సినిమాల సరసన పెద్ది కూడా చేరడం స్టార్ హీరోగా రామ్ చరణ్ మాస్ పుల్లింగ్ కెపాసిటీకి నిదర్శనంగా నిలిచింది.

ఒక కమర్షియల్ సినిమాకు మిక్స్ టాక్ వస్తే సాధారణంగా వీకెండ్ ముగిసే లోపే వసూళ్లు దారుణంగా పడిపోతాయి. కానీ ఇక్కడ దానికి భిన్నంగా ప్రతిరోజూ కలెక్షన్ల గ్రాఫ్ పైకి వెళ్లడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. 4వ రోజు ఆదివారం కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కట్టారు. దీనికి తోడు రూరల్ మాస్ సెంటర్లలో 1980ల నాటి కోస్తాంధ్ర కుస్తీ నేపథ్యం ఉన్న కథకు పబ్లిక్ బాగా కనెక్ట్ అవ్వడం ఈ వసూళ్లకు ప్రధాన కారణం.

దర్శకుడు బుచ్చిబాబు సానా కీలక డ్యామేజ్ కంట్రోల్ నిర్ణయం కూడా ఈ జంప్ కు బాగా హెల్ప్ అయింది. సినిమాలో ఆడవారు ఇబ్బంది పడేలా ఉన్నాయని విమర్శలు వచ్చిన సీన్లను వెంటనే కట్ చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న కాస్తోకూస్తో నెగిటివిటీ పూర్తిగా పోయింది. అందుకే ఆదివారం ఉదయం ఆటలతోనే అన్ని మాస్, క్లాస్ సెంటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.

క్లీన్ కంటెంట్ తో సినిమా నడుస్తుండటంతో టికెట్ కౌంటర్ల దగ్గర సందడి మరింత పెరిగింది. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లకు అమ్మినట్లు ట్రేడ్ వర్గాల్లో ఒక బలమైన టాక్ నడుస్తోంది. దాదాపు 400కోట్లకు పైగా గ్రాస్ అయితే రావాలి. ఇక మొదటి మూడు రోజుల్లోనే 236 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ యాక్షన్ డ్రామా, నాలుగో రోజు సాధించిన ఈ రికార్డ్ షేర్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దిశగా చాలా వేగంగా అడుగులు వేస్తోంది.

ఆదివారం వచ్చిన సాలిడ్ బూస్ట్ తో సినిమాను కొన్న బయ్యర్లలో, డిస్ట్రిబ్యూటర్లలో పూర్తి నమ్మకం ఏర్పడింది.

ప్రెజెంట్ థియేటర్ల దగ్గర ఈ సినిమా వసూళ్లకు బ్రేకులు వేసే వేరే పెద్ద సినిమాలు ఏవీ లైన్ లో లేవు. ఈ క్లియర్ సోలో రన్ పెద్ది సినిమాకు దొరికిన అతిపెద్ద అడ్వాంటేజ్. ఫస్ట్ వీకెండ్ లో క్రియేట్ చేసిన ఈ స్ట్రాంగ్ పాజిటివ్ వైబ్ ను సోమవారం లాంటి వర్కింగ్ డేస్ లో కూడా కంటిన్యూ చేస్తే ప్రాఫిట్ జోన్ లోకి అడుగుపెట్టడం ఈజీ అవుతుంది.