Begin typing your search above and press return to search.

రెహ‌మాన్ ట్యూన్.. చ‌ర‌ణ్ స్టెప్పులు.. జాన్వీ గ్లామ‌ర్ నెక్ట్స్ లెవెల్ అంతే!

ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా డిజాస్ట‌ర్ అవ‌డంతో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్, అత‌ని ఫ్యాన్స్ ఫోక‌స్ మొత్తం పెద్ది సినిమాపైనే ఉంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Aug 2025 12:26 PM IST
రెహ‌మాన్ ట్యూన్.. చ‌ర‌ణ్ స్టెప్పులు.. జాన్వీ గ్లామ‌ర్ నెక్ట్స్ లెవెల్ అంతే!
X

ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా డిజాస్ట‌ర్ అవ‌డంతో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్, అత‌ని ఫ్యాన్స్ ఫోక‌స్ మొత్తం పెద్ది సినిమాపైనే ఉంది. సుకుమార్ శిష్యుడు, బ్లాక్ బ‌స్ట‌ర్ ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సాన పెద్ది సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచ‌నాలే ఉన్నాయి. మొన్నా మ‌ధ్య చ‌ర‌ణ్ బ‌ర్త్ డే కు ఫ‌స్ట్ షాట్ పేరుతో పెద్ది నుంచి చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేయ‌గా దాంతో ఆ సినిమాపై ఉన్న అంచ‌నాలు ఇంకాస్త పెరిగాయి.

మొద‌టిసారి చ‌ర‌ణ్‌- జాన్వీ క‌లిసి..

విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా న‌టిస్తున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి మొద‌టి సారి చేస్తున్న సినిమా కావ‌డంతో ఆన్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందోన‌ని చూడ్డానికి ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.

శ‌ర‌వేగంగా షూటింగ్

వీలైనంత త్వ‌ర‌గా పెద్ది షూటింగ్ ను పూర్తి చేసి కాస్త టైమ్ తీసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ను నెమ్మ‌దిగా చేయాల‌ని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నార‌ట‌. అందులో భాగంగానే షూటింగ్ కు పెద్ద‌గా గ్యాప్ ఇవ్వ‌కుండా వెంట‌వెంట‌నే షెడ్యూల్స్ ను వేసుకున్నారు. ఇదిలా ఉంటే పెద్ది సినిమాకు సంబంధించిన త‌ర్వాతి షెడ్యూల్ పై ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది.

ఆగ‌స్ట్ 20వ తేదీ నుంచి హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ది సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ మొద‌లుకానుంద‌ని, ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్ పై ఓ గ్రాండ్ సాంగ్ ను తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు నెక్ట్స్ లెవెల్ ఆల్బ‌మ్ ను ఇచ్చార‌ని అంటున్నారు. రెహ‌మాన్ మ్యూజిక్, చ‌ర‌ణ్ స్టెప్పులు, జాన్వీ గ్లామ‌ర్ ట్రీట్ అన్నీ ఫ్యాన్స్ కు ప‌క్కా ట్రీట్ ఇస్తాయ‌ని ఇన్‌సైడ్ టాక్. కాగా వ‌చ్చే ఏడాది మార్చిలో పెద్ది సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.