Begin typing your search above and press return to search.

'చికిరి చికిరి'.. వరల్డ్‌వైడ్ సెన్సేషన్, 13 దేశాల్లో ట్రెండింగ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న 'పెద్ది' (RC16) కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో తెలిసిందే.

By:  M Prashanth   |   8 Nov 2025 8:59 PM IST
చికిరి చికిరి..  వరల్డ్‌వైడ్ సెన్సేషన్, 13 దేశాల్లో ట్రెండింగ్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న 'పెద్ది' (RC16) కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్. రెహమాన్ అందించబోయే పాటలపై హై రేంజ్ అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ "చికిరి చికిరి" యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇది కేవలం ఇండియాలోనే కాదు, గ్లోబల్‌గా పెద్ద సౌండ్ చేస్తోందని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.




"చికిరి చికిరి" సాంగ్ రెస్పాన్స్ అదిరిపోవడంతో, 'పెద్ది' టీమ్ ఒక కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌పై "చికిరి చికిరి వరల్డ్ వైడ్ సెన్సేషన్" అని గట్టిగా ప్రకటించారు. ఎందుకంటే ఈ పాట ప్రస్తుతం ఏకంగా 13 దేశాల్లో యూట్యూబ్ ట్రెండింగ్‌ లిస్ట్‌లో దూసుకుపోతోంది. మాస్ విజువల్స్ లో అందరికి కనెక్ట్ అయ్యేలా సాంగ్ ను డిజైన్ చేసిన విధానం అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.

ఈ ట్రెండింగ్ లిస్ట్‌లో ఇండియాలో నెంబర్ వన్ లో ఉండటం కామన్. కానీ, అసలు మ్యాటర్ గల్ఫ్ దేశాల్లో ఉంది. ఇండియా, బహ్రెయిన్, కువైట్.. ఈ మూడు దేశాల్లో "చికిరి చికిరి" సాంగ్ ఏకంగా నెంబర్ 1 పొజిషన్‌లో ట్రెండ్ అవుతోంది. ఇది నిజంగా సినిమాకు బూస్ట్ ఇచ్చే విషయం. అంతేకాదు, యూఏఈ, ఖతార్‌లలో కూడా 4వ ర్యాంకులో ట్రెండ్ అవుతూ, మిడిల్ ఈస్ట్‌లో 'పెద్ది' వైబ్ గట్టిగా స్ప్రెడ్ అయిందని ప్రూవ్ చేస్తోంది.

గల్ఫ్ మాత్రమే కాదు, వెస్ట్రన్ కంట్రీస్‌లోనూ చరణ్ స్టెప్స్ రచ్చ చేస్తున్నాయి. యూకే (UK), ఐర్లాండ్‌లలో ఈ పాట 7వ ర్యాంకులో ట్రెండ్ అవుతోంది. ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి చోట్ల 13వ ర్యాంకులో ఉంది. నార్త్ అమెరికన్ మార్కెట్‌లో కూడా కెనడాలో 37, యునైటెడ్ స్టేట్స్ (USA)లో 40 ర్యాంకుల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. న్యూజిలాండ్, స్వీడన్‌లలో కూడా ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది.

ఈ గ్లోబల్ రెస్పాన్స్‌కు కారణం రామ్ చరణ్ ఊరమాస్ లుక్, ఆయన వేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్ విజువల్‌గా కిక్ ఇస్తున్నాయి. దానికి ఏ.ఆర్. రెహమాన్ ఇచ్చిన 'స్లో పాయిజన్' లాంటి రూరల్ బీట్ తోడైంది. బుచ్చిబాబు క్రియేట్ చేసిన ఈ రస్టిక్ వరల్డ్, చరణ్ డ్యాన్స్, రెహమాన్ మ్యూజిక్.. ఈ మూడు కలిపి పాటను ఇన్‌స్టంట్‌గా గ్లోబల్ చార్ట్‌బస్టర్‌ను చేశాయి.

సినిమా రిలీజ్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది.వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. కానీ, ఫస్ట్ సింగిల్‌కే ఈ రేంజ్ గ్లోబల్ ట్రెండింగ్ సెట్ అవ్వడం చూస్తుంటే, 'పెద్ది'పై వరల్డ్‌వైడ్‌గా ఎలాంటి హైప్ ఉందో అర్థమవుతోంది. ఈ ఒక్క పాటతోనే సినిమాకు కావాల్సినంత బేస్ క్రియేట్ అయింది. ఇక ట్రైలర్ వస్తే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.