Begin typing your search above and press return to search.

అక్కడ రామాయణ.. ఇక్కడ వారణాసి.. ఏం జరుగుతుందో?

ఆ సినిమాల్లో రెండు రామాయణ, వారణాసి. ఇతిహాసం రామాయణం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా రామాయణ మూవీ నార్త్ లో రూపొందుతోంది.

By:  M Prashanth   |   16 Nov 2025 11:38 PM IST
అక్కడ రామాయణ.. ఇక్కడ వారణాసి.. ఏం జరుగుతుందో?
X

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మైథలాజికల్ జోనర్ లో సినిమాలు రూపొందుతుంటాయి. ఇప్పటికే వివిధ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు మరిన్ని చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఆయా మూవీల షూటింగ్స్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది థియేటర్స్ లోకి వచ్చి సందడి చేయనున్నాయి.

ఆ సినిమాల్లో రెండు రామాయణ, వారణాసి. ఇతిహాసం రామాయణం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా రామాయణ మూవీ నార్త్ లో రూపొందుతోంది. రెండు భాగాల్లో రిలీజ్ కానుంది. అదే సమయంలో సౌత్ లో వారణాసి సినిమా తెరకెక్కుతోంది. ఆ మూవీలో మైథాలజీతోపాటు టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్స్ టచెస్ కూడా ఉన్నాయని వినికిడి.

ఏదేమైనా రామాయణ, వారణాసి.. రెండు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రాలే.. పాన్ ఇండియా సినిమాలే.. ఇప్పుడు రెండూ షూటింగ్స్ ను జరుపుకుంటున్నాయి. అయితే రెండింటిపై కూడా ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లింప్సెస్ తో సినీ ప్రియులు, అభిమానులు హోప్స్ పెట్టుకున్నారు.

అదే సమయంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక కంపేరిజన్లు ఉంటాయని అనేక మంది నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రామాయణంలోని కొంత అంశాన్ని మన రాజమౌళి వారణాసి మూవీకి గాను తీసుకున్నట్లు ఇప్పటికే గ్లింప్స్ అండ్ రాజమౌళి కామెంట్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.

దీంతో పోలికలు వస్తాయని, ఇది మేకర్స్ కు సవాల్ లాంటిదని అభిప్రాయపడుతున్నారు. అయితే రామాయణ, వారణాసి డైరెక్టర్లు నితీష్ తివారీ, రాజమౌళి.. ఇద్దరూ మంచి టాలెంట్ ఉన్న దర్శకులే. రామాయణ మూవీతో విజువల్ వండర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆడియన్స్ కు మంచి ఎక్సపీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పద్దతి.. ఒక ప్లానింగ్.. ఒక విజన్ అనే స్టేట్మెంట్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇప్పటికే బాహుబలి సిరీస్ చిత్రాలతోపాటు ఆర్ ఆర్ ఆర్ తో వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియులను అలరించారు. ఇప్పుడు వారణాసి మూవీతో రాజమౌళి ప్రేక్షకులను నిరాశపరచడనే నమ్మకం అందరికీ ఉంది. కాబట్టి అటు రామాయణ.. ఇటు వారణాసి సినిమాలు రిలీజ్ అయ్యాక ఏం జరుగుతుందో వేచి చూడాలి.