Begin typing your search above and press return to search.

రామాయణ Vs వారణాసి.. పోల్చడం కరెక్టేనా?

బాలీవుడ్‌ లో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం రామాయణ, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతున్న వారణాసి సినిమాల మధ్య పోలికలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.

By:  M Prashanth   |   2 April 2026 6:41 PM IST
రామాయణ Vs వారణాసి.. పోల్చడం కరెక్టేనా?
X

బాలీవుడ్‌ లో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం రామాయణ, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతున్న వారణాసి సినిమాల మధ్య పోలికలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. రామాయణ మూవీని నితీష్ తివారీ తెరకెక్కిస్తుండగా.. వారణాసిని రాజమౌళి రూపొందిస్తున్నారు. అయితే ఆ రెండు చిత్రాలను నేరుగా పోల్చడం సరైనది కాదా అన్న విషయంపై అంతా మాట్లాడుకుంటున్నారు.

కథా పరంగా చూస్తే రామాయణ పూర్తి స్థాయిలో శ్రీరాముడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని సాగే మహాకావ్య చిత్రం. ఇది సుమారు మూడు గంటలపాటు ప్రేక్షకులను ఒక పౌరాణిక ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వారణాసి సినిమా మాత్రం టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతూ, అందులో రామాయణానికి సంబంధించిన అంశాలు కేవలం 20 నిమిషాల పాటు కనిపించే ఎపిసోడ్‌ గా ఉంటాయని సమాచారం.

దీంతో ఆ రెండు చిత్రాల మధ్య నేరుగా పోలిక చేయడం కంటే, వాటి ప్రత్యేకతలను వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు సినీ ప్రియులు చెబుతున్నారు. విజువల్స్ విషయానికి వస్తే.. రామాయణ చిత్రం అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తూ, భారీ స్థాయిలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌ పై దృష్టి పెట్టింది. ప్రతి ఫ్రేమ్‌ లో కూడా ఒక పౌరాణిక గొప్పతనాన్ని చూపించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నారు.

దీంతో ఆ సినిమా విజువల్‌ గా అద్భుతంగా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇక వారణాసి విషయానికి వస్తే, ఇందులో కెమెరా మూవ్మెంట్స్, యాక్షన్ సన్నివేశాలు మరింత డైనమిక్‌ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా హీరోయిజాన్ని హైలైట్ చేసే విధంగా షాట్లు ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజువల్ ప్రెజెంటేషన్‌ లో రెండు సినిమాలు రెండు విభిన్న దారుల్లో ప్రయాణిస్తున్నాయని చెప్పాలి.

దర్శకుల విషయానికి వస్తే, నితీష్ తివారీ భావోద్వేగ కథలు చెప్పడంలో నైపుణ్యం కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. దంగల్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను కదిలించిన ఆయన, ఈసారి కూడా భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే భారీ యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలిమెంట్స్‌ ను అల్లడంలో ఆయనకు పరిమితులు ఉండొచ్చనే అభిప్రాయం కొందరిలో ఉంది.

అదే సమయంలో వారణాసి విషయంలో మాత్రం దర్శకుడు మాస్, యాక్షన్, డ్రామాటిక్ ఎలిమెంట్స్‌ ను కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి స్టైల్‌ లో కనిపించే భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్స్ వంటి అంశాలు చిత్రానికి ప్లస్ పాయింట్‌ గా టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా రామాయణ, వారణాసి సినిమాలు రెండు విభిన్న జానర్లలో, విభిన్న కథా నేపథ్యాలతో తెరకెక్కుతున్నాయి. ఒకటి పౌరాణిక మహాకావ్యం కాగా, మరొకటి టైమ్ ట్రావెల్ థ్రిల్లర్. కాబట్టి ఆ రెండు సినిమాలను పోల్చడం కన్నా.. ఫుల్ గా ఆస్వాదించడం మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు.