Begin typing your search above and press return to search.

రామాయణ ట్రైలర్.. మళ్ళీ కొత్తగా.. 100 కోట్ల వ్యూస్

బాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో హైలెట్ అవుతోంది.

By:  M Prashanth   |   6 Aug 2026 6:57 PM IST
రామాయణ ట్రైలర్.. మళ్ళీ కొత్తగా.. 100 కోట్ల వ్యూస్
X

బాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో హైలెట్ అవుతోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళికి థియేటర్లలోకి రానుంది. వారం క్రితం జూలై 30న రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ఒక క్యూరియాసిటిని క్రియేట్ చేసింది. ఇక వచ్చిన రెస్పాన్స్ చూసి ఇండస్ట్రీ జనాలు షాక్ అవుతున్నారు.

ట్రైలర్ రిలీజైన కేవలం వారం రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల వ్యూస్ మార్క్ దాటేసింది. ఇండియన్ సినిమాలో ఒక ట్రైలర్ కు ఈ రేంజ్ లో బిలియన్ వ్యూస్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ వీడియోను ఉహించని స్థాయిలో షేర్ చేయడంతో ప్రతి ప్లాట్‌ఫామ్ లో ఇదే గట్టిగా ట్రెండ్ అయింది.

ఈ బిలియన్ వ్యూస్ రికార్డు సెలబ్రేషన్స్ లో భాగంగా మేకర్స్ ఈ రోజు ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ ట్రైలర్ ను ఏఐ ఎన్హాన్స్డ్ లిప్ సింక్ టెక్నాలజీతో అప్‌డేట్ చేసి మళ్లీ ఆడియన్స్ ముందుకు తెచ్చారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆర్టిస్టుల డైలాగ్స్ కి తగ్గట్టుగా పెదాల కదలికలను సెట్ చేశారు. మొదట ట్రైలర్ పై కొంత టాక్ బిన్నంగా ఉన్నప్పటికీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా మరో లెవెల్లో హైలెట్ అయ్యింది.

సాధారణంగా వేరే భాషల్లోకి డబ్ చేసినప్పుడు మాటలు ఒకలా, పెదాల మూమెంట్స్ ఇంకోలా కనిపిస్తుంటాయి. కానీ ఈ ఏఐ టెక్నాలజీ వల్ల ఆ ప్రాబ్లమ్ కవర్ అయింది. ఏ లాంగ్వేజ్ లో చూసినా సరే, ఆ నటీనటులు సొంతంగా అదే భాష మాట్లాడినట్లే చాలా నాచురల్ గా అనిపిస్తోంది. డబ్బింగ్ ఫీలింగ్ అస్సలు రావడం లేదు అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఈ కొత్త ఏఐ వర్క్ చూసిన ఆడియన్స్ నుంచి సోషల్ మీడియాలో మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. డైలాగ్స్ మరింత క్లియర్ గా, సహజంగా ఉండటంతో ట్రైలర్ ఇంపాక్ట్ రెట్టింపు అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్లలో కూడా ఇదే క్వాలిటీతో సినిమా ఉంటే చూసేటప్పుడు మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ దొరుకుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. నమిత్ మల్హోత్రా, నితేష్ తివారీ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేశారు. ప్రమోషన్స్ విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. 100 కోట్ల వ్యూస్ తో ఊపు మీదున్న ఈ రామాయణ ప్రాజెక్ట్ దీపావళికి రిలీజ్ అయ్యాక ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.