Begin typing your search above and press return to search.

అమిత్‌ షాతో భేటీలో రావణుడు ఎక్కడ..?

రణబీర్ కపూర్, సాయి పల్లవి నటించిన ‘రామాయణ’ రూ.1,800 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాతో పాటు చిత్రబృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసింది. అయితే రావణుడిగా నటించిన యశ్ ఈ భేటీకి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.

By:  Ramesh Palla   |   26 Nov 2026 2:36 PM IST
అమిత్‌ షాతో భేటీలో రావణుడు ఎక్కడ..?
X

రణబీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన 'రామాయణ' సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఇంకా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది. రామాయణ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్‌ వద్ద రూ.1800 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం అందుతోంది. లాంగ్ రన్‌లో సినిమా కచ్చితంగా రూ.2000 కోట్ల మార్క్‌ ను క్రాస్ చేసి గత రికార్డ్‌లన్నీ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు నమ్ముతున్నారు. ఒక వైపు సినిమా దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తూ ఉంటే, మరో వైపు చిత్ర యూనిట్‌ సభ్యులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సక్సెస్‌ పార్టీలు ఏర్పాటు చేయడంతో పాటు, పలు కార్యక్రామాలు నిర్వహించడం ద్వారా సక్సెస్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అంతే కాకుండా సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అమిత్‌ షాతో రామాయణ టీం...

తాజాగా రామాయణ యూనిట్‌ సభ్యులు అంతా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవడం జరిగింది. ఆయనతో రామాయణ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అమిత్ షాతో భేటీ అయిన వారిలో హీరో రణబీర్‌ కపూర్‌, హీరోయిన్‌ సాయి పల్లవి, దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్‌ మల్హోత్రలు ఉన్నారు. ఇంకా సినిమాకు వర్క్‌ చేసిన కీలక బృందం సైతం అమిత్‌ షాను కలిసిన వారిలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. సినిమా సూపర్‌ హిట్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులకు కేంత్ర మంత్రి అమిత్‌ షా శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలుస్తోంది. రామాయణం వంటి గొప్ప కథను ఈతరం ప్రేక్షకులకు అందించేందుకు మీరు చేసిన ప్రయత్నం గొప్పది అంటూ యూనిట్‌ సభ్యులను మంత్రి అమిత్ షా అభినందించినట్లుగానూ తెలుస్తోంది.

రావణుడిగా యశ్‌...

ఈ భేటీలో రావణుడి పాత్రను పోషించిన కన్నడ స్టార్‌ యశ్‌ కనిపించక పోవడం విశేషం. ఆయన ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం మాత్రమే కాకుండా నిర్మాతల్లో కూడా ఒకరు అనే విషయం తెల్సిందే. ఇంత ముఖ్యమైన భేటీకి ఆయన హాజరు కాకపోవడం వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా అంటూ చర్చ మొదలైంది. రాజకీయాల కారణంగా ఏమైనా యశ్‌ ఈ భేటీకి దూరంగా ఉండి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే యశ్‌ కొన్ని కారణాల వల్ల హాజరు కాలేదని, రాజకీయ ఉద్దేశం ఏమీ లేదని కొందరు అంటున్నారు. యశ్‌ విదేశీ పర్యటనలో ఉన్నాడు కనుక ఈ భేటీకి రాలేదని మరికొందరు సోషల్‌ మీడియాలో మాట్లాడుతున్నారు. ఎక్కువ శాతం మంది మాత్రం ఈ భేటీలో రావణుడిగా నటించిన యశ్‌ లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు కారణం ఏంటీ అనేది యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

రామాయణ రెండో పార్ట్‌ రిలీజ్‌...

రామాయణ సినిమాను ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లుగా నిర్మాత నమిత్‌ మల్హోత్ర మొదటి నుంచి చెబుతూ వస్తున్నాడు. ఆయన అన్నట్లుగానే సినిమాలో భారీతనం కనిపిస్తుంది. విజువల్‌ వండర్‌గా సినిమా రూపొందింది. హాలీవుడ్‌ రేంజ్‌ గ్రాఫిక్స్‌ను సినిమాలో ప్రేక్షకులు ఎక్స్‌పీరియన్స్‌ చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఖర్చు చేశారో అర్థం చేసుకోవచ్చు. సినిమాలోని ప్రతి సీన్‌ ఇంతకు ముందు సినిమాల్లో చూసిందే అయినప్పటికీ కొత్తగా కనిపించడం కోసం గ్రాఫిక్స్‌ను వినియోగించుకున్నారు. విజువల్స్‌తో కథను కొత్తగా చెప్పినట్లు అయింది. రామాయణ రెండో పార్ట్‌ ను 2027 దీపావళికి విడుదల చేయాలని భావించారు. కానీ రెండో పార్ట్‌ ను అంతకు మించి అన్నట్లుగా రూపొందించడం కోసం వీఎఫ్‌ఎక్స్ ను మరింతగా వినియోగించాలని భావిస్తున్నారు. అందుకే రామాయణ పార్ట్‌ 2 2028 దీపావళికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.