రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?
దీపావళికి విడుదలైన 'రామాయణ' సినిమా ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.675 కోట్ల వసూళ్లు సాధించినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు వస్తున్న స్పందనతో రాజమౌళి మహాభారతం తెరకెక్కించాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం 'వారణాసి' సినిమాతో బిజీగా ఉన్న జక్కన్న, తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు మొదలుపెడతారనే ఆసక్తి నెలకొంది.
By: Ramesh Palla | 10 Nov 2026 10:05 AM ISTఇండియన్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'రామాయణ' మూవీ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలిసిన కథే అయినా వీఎఫ్ఎక్స్ బాగున్నాయి, రావణుడి చుట్టూ కథ తిప్పడం కొత్తగా ఉందంటూ రివ్యూలు వచ్చాయి. విజువల్ వండర్‌గా రూపొందిన రామాయణ సినిమా రెండో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్ హంగులు అద్దడంతో అద్భుతంగా ఉందని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆకట్టుకునే కథనం తో దర్శకుడు ప్రేక్షకులను కట్టి పడేశాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సినిమాకు కొన్ని నెగిటివ్ ఉంటాయి. ఈ సినిమాకు కూడా కొన్ని నెగిటివ్ పాయింట్ ను రివ్యూవర్స్ ఎత్తి చూపుతున్నారు. అయితే ప్రేక్షకులు మాత్రం వాటిని పట్టించుకోకుండా థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు.
రామాయణ సినిమా కలెక్షన్స్...
దీపావళి సందర్భంగా వచ్చిన సెలవు సద్వినియోగం చేసుకుని రామాయణ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది. ఐదు రోజుల్లో రామాయణ సినిమా దాదాపుగా రూ.675 కోట్లను రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దండయాత్రకు రెడీ అవుతోంది. ఇంగ్లీష్‌లో విడుదలైన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పలు విదేశీ భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు చేరువ చేయడం కోసం టీం చాలా కష్టపడుతుంది. రామాయణ సినిమా విడుదలైనప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ రామాయణ సినిమాను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించి ఉంటే బాగుండేదని, ఆయన దర్శకత్వంలో వచ్చి ఉంటే మరో రేంజ్ లో సినిమా ఉండేది, వీఎఫ్ఎక్స్ సైతం అంతకు మించి అన్నట్లుగా ఉండేవి అనేది చాలా మంది అభిప్రాయం.
వారణాసి సినిమాతో రాజమౌళి బిజీ...
రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న వారణాసి సినిమా తర్వాత రాజమౌళి మహాభారతం సినిమా తీయాలని ఆయన అభిమానులతో పాటు, సగటు సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. అందుకు కారణం రామాయణ సినిమా కు వస్తున్న స్పందన. సాధారణంగానే పౌరాణిక సినిమాలకు ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అలాంటిది విజువల్ వండర్‌గా, ఎమోషన్స్ తో కట్టి పడేసే విధంగా సినిమాలు తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా సార్లు నిరూపితం అయ్యింది. రామాయణ కు ఈ రేంజ్ లో వసూళ్లు వస్తున్న నేపథ్యంలో జక్కన్న మహాభారతం తీసే సమయం వచ్చినట్లుగా అనిపిస్తోందని ఆయన అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు సైతం జక్కన్న రామాయణ కు సమయం వచ్చినట్లే అంటున్నారు.
రాజమౌళి మహాభారతం సినిమా...
కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మహాభారతం ను సినిమాగా తీయాలి అనేది డ్రీమ్ అన్నాడు. అయితే మహాభారతం సినిమా తీయాలి అంటే ఇంకా వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ పెరగాలని, తాను అనుకున్నట్లుగా వీఎఫ్ఎక్స్ కావాలంటే ఇంకా చాలా సమయం కావాల్సి ఉందని అన్నాడు. ఆ వ్యాఖ్యల తర్వాత టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఏఐ తో వీఎఫ్ఎక్స్ లో అద్భుతాలు ఆవిష్కారం అవుతున్నాయి. కనుక రాజమౌళి మహాభారతం తీసే సమయం వచ్చిందని, అందుకు తగ్గట్టుగా టెక్నాలజీ రెడీ అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కనుక రాజమౌళి తన వారణాసి తర్వాత వెంటనే మహాభారతం సినిమాను మొదలు పెట్టాలని అభిమానులతో పాటు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
రాజమౌళి ఒక సినిమా మొదలు పెట్టాలంటే చాలా ముందస్తు ఏర్పాట్లు ఉంటాయి, చాలా ఆలోచిస్తారు. కనుక మహాభారతం విషయంలో ఆయన ఆలోచన ఏమైనా మారిందా అనే విషయం తెలియాలంటే వారణాసి సినిమా ప్రమోషన్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ సినిమా ప్రమోషన్ సందర్భంగా మహాభారతం గురించి ఏమైనా చెప్తాడేమో చూడాలి. 2035 వరకు అయినా రాజమౌళి మహాభారతం మొదలు పెట్టాలని, 2040 వరకు అన్ని పార్ట్ లు విడుదల కావాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరి రాజమౌళి ఏం చేస్తాడో చూడాలి.
