Begin typing your search above and press return to search.

రామాయణ.. రెహమాన్ ఫాస్ట్‌ గా క్లారిటీ ఇవ్వాల్సిందేనా

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. రామాయణ మూవీలోని ప్రతి ఎలిమెంట్ పై ఆడియన్స్ లో మంచి ఇంట్రెస్ట్ ఉంది.

By:  M Prashanth   |   26 Oct 2026 10:39 AM IST
రామాయణ.. రెహమాన్ ఫాస్ట్‌ గా క్లారిటీ ఇవ్వాల్సిందేనా
X

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. రామాయణ మూవీలోని ప్రతి ఎలిమెంట్ పై ఆడియన్స్ లో మంచి ఇంట్రెస్ట్ ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రీసెంట్ గా విడుదలైన 'రంగులు రంగులే' పాటపై సోషల్ మీడియాలో రకరకాల రెస్పాన్సులు వస్తున్నాయి. దీంతో ఆ సాంగ్ కంపోజ్ చేసిన ఏఆర్ రెహమాన్ ఇప్పుడు విమర్శలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది.

రణబీర్ కపూర్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న 'రామాయణ' మూవీ నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రెండు పార్టులుగా ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఆ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచాయి. ఇప్పుడు పాటల విషయంలోనూ అదే రేంజ్ లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలని మూవీ భావిస్తోంది.

అందులో భాగంగా రిలీజ్ చేసిన 'రంగులు రంగులే' సాంగ్ సీతారాముల జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చూపిస్తోంది. వారి వివాహం, అయోధ్యలో జీవితం, అరణ్యవాసం వంటి సందర్భాలను సాంగ్ లో చూపించారు. రాకేందు మౌళి సాహిత్యం అందించగా.. రాఘవ్ కౌశిక్, వైశాలి సమంత్ ఆలపించారు. అయితే ఆ పాటపై అందరూ ఒకేలా స్పందించడం లేదు. కొందరు పాటలోని సంగీతాన్ని మెచ్చుకుంటుండగా.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

సాంగ్ లో సూఫీ, ఖవ్వాలీ మ్యూజిక్ ను పోలిన బీట్స్ ఉన్నాయని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. రామాయణం వంటి ఇతిహాసానికి సంబంధించిన సాంగ్ లో ఇండియన్ ట్రెడిషన్ మ్యూజిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న అభిప్రాయాలే. సాంగ్ లో యూజ్ చేసిన మ్యూజిక్ పై విమర్శలు వస్తున్నంత మాత్రాన అది తప్పు అని ఎవరూ చెప్పలేం.

అయితే సంగీతంలో కొత్త ప్రయోగాలు చేయడం మామూలే. కానీ రామాయణం వంటి కథను తీసుకొస్తున్నప్పుడు ప్రేక్షకులు కొన్ని ప్రత్యేకమైన అంచనాలతో ఉంటారు. ముఖ్యంగా సీతారాముల కల్యాణం వంటి పవిత్ర ఘట్టాన్ని చూపించే సాంగ్ లో మ్యూజిక్ కూడా ఆ ఫీలింగ్ కు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. అందుకే రెహమాన్ మ్యూజిక్ పై చర్చ మొదలైంది. ఆయనకు ఇంటర్నేషనల్ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఎన్నో రకాల సంగీత ప్రయోగాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది.

అయినప్పటికీ రామాయణ వంటి మూవీలకు మ్యూజిక్ అందిస్తున్నప్పుడు ప్రేక్షకుల టేస్ట్ కూడా ముఖ్యమే. అందుకే ఆ పాటపై వస్తున్న విమర్శలను మూవీ టీమ్ ఎలా తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. సినిమా రిలీజ్ కు ముందు సాంగ్స్ పై చర్చ జరగడం కామనే. అయితే అది మరింత పెరిగితే సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలున్న ఆ చిత్రానికి అనవసరమైన వివాదాలు ఇబ్బందిగా మారకూడదు. అందుకే సాంగ్ వెనుక ఉన్న మ్యూజిక్ థాట్ ను రెహమాన్ లేదా మూవీ టీమ్ వివరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.