తెలిసిన కథతో ఇదే సమస్యా?
‘రామాయణం’ మొదటి భాగంతో విజయం అందుకున్న దర్శకుడు నితీశ్ తివారీకి ఇప్పుడు రెండో భాగం అసలైన సవాల్‌గా మారింది. రామాయణ కథ అందరికీ తెలిసినదే కావడంతో కొత్త ట్విస్టులకు అవకాశం లేదు. మొదటి భాగం ముగిసిన చోటు నుంచే కథను కొనసాగించాల్సి ఉండటంతో, పాత్రల ఔన్నత్యం, ఆసక్తికరమైన కథనం, విజువల్స్‌తో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రెండో భాగం షూటింగ్ కూడా ముగింపు దశకు చేరినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
By: Srikanth Kontham | 8 Nov 2026 4:41 PM ISTతెలిసిన కథ ను వెండి తెరపై ఆవిష్కరించడం ఏ దర్శకుడికైనా సవాల్ తో కూడుకున్న వ్యహారమే. అయితే ఆ కథను తానెంత గ్రిప్పింగ్ గా చెప్పారు? అన్నదే అత్యంత కీలకం. భారత ఇతిహాసాల ఆధారంగా ఇప్పటి వరకూ ఎన్నో సీనియర్లు..సినిమాలొచ్చాయి. వాటి ద్వారా ఎవరి ట్యాలెంట్ ఏంటి? అన్నది ప్రూవ్ చేసుకున్నారు. అందులో కొంద రు సక్సస్ అయ్యారు. మరికొందరు ఫెయిలయ్యారు. తాజాగా ఇటీవలే నితీశ్ తివారీ తెరకెక్కించిన `రామాయణం` మొదటి భాగం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రాముడిగా రణబీర్ కపూర్... సీతగా సాయి పల్లవి..రావణాసురిడిగా యశ్ నటించిన సినిమా విజయం సాధించింది.
బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో మొదటి భాగం పరంగా నితీష్ సక్సెస్ అయ్యారు. అయితే రామాయణం అంటే అందరికీ తెలిసిన కథే. రామాయణం గురించి ఎవర్ని అడిగినా? ఇట్టే చెబుతారు. దీంతో నితిష్ తివారీ దాచాలనుకున్న పాత్రల హైడ్ చేయడానికి ఎంత మాత్రం ఛాన్స్ లేదు. మొదటి భాగం వరకూ ఎలాగూ నితీష్ సక్సెస్ అయ్యారు. దీంతో రెండవ భాగంపై అంచనాలు పీక్స్ కు చేరాయి. ఇప్పుడా అంచనాలు నితీష్కు పెను సవాళ్లుగా మారుతున్నాయి? అన్నది అంతే నిజం. మొదటి భాగాన్ని ఎక్కడితో ఎండ్ చేసారో? అక్కడ నుంచే రెండవ భాగం మొదలవుతుంది.
ఇప్పుడీ కథను నితీష్ ఎంత ఎంగేజింగ్ గా చెబుతాడు? అన్నది సర్వత్రాఇ జరుగుతోన్న చర్చ. ఇందులో కొత్తగా ట్విస్టులతో మెలి పెట్టడానికి ఎంత మాత్రం ఆస్కారం లేదు. కట్టప్ప `బాహుబలి`ని ఎందుకు చంపాడు? అన్నది రాజమౌళి `బాహుబలి` మొదటి భాగంలో పెద్ద ఊహించని ట్విస్ట్. ఆ పాయింట్ పట్టుకుని రెండవ భాగాన్ని నడిపించారు రాజమౌళి. కానీ రామాయణంలో ఆసక్తికర సన్నివేశం లేదు. అలాగని నితిష్ రెండవ భాగాన్ని కేవలం విజువల్ పరంగానే హైలైట్ చేద్దామంటే? అది ఎంత వరకూ వర్కౌట్ అవుతుంది? అన్న దానిపై నా పునరాలచోనలో పడినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.
అయితే ఇప్పటికే నితిష్ రెండవ భాగం షూటింగ్ కూడా ముంగింపుకు తీసుకొచ్చారు. అలాగే రామాయణం మూడవ భాగం కూడా ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా రిస్క్ తీసుకోవాలనుకున్నా? రీషూట్ కి వెళ్లాల్సి ఉంటుంది. అలా చేస్తే నిర్మాత మళ్లీ కోట్టు గుమ్మరించాలి. అది జరిగే పని కాదు కాబట్టి? మొదటి భాగం ఎండ్ నుంచే రెండవ భాగం కథను ముందుకు నడిపించనున్నారు. పాత్రల పరంగా వాటి ఔన్నత్యాన్ని చాటడం వరకే నితీష్ చాకచక్యంగా వ్యవహరిస్తే సరిపోతుంది? అని విశ్లేషకులు భావిస్తున్నారు.
