రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!
‘రామాయణం: పార్ట్ 1’ విడుదలైన ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే సీత పాత్రలో సాయిపల్లవి లుక్, హెయిర్ స్టైల్, గొంతుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రణ్‌బీర్ కపూర్‌కు మిశ్రమ స్పందన లభిస్తుండగా, రావణుడిగా నటించిన యష్‌కు మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 13 Nov 2026 3:56 PM ISTనవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటించిన రామాయణం: పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. అయితే సినిమా వసూళ్ల విషయంలో సానుకూల స్పందన కనిపిస్తున్నా, నటీనటుల విషయంలో మాత్రం మిశ్రమ స్పందనలే వస్తున్నాయి.
ముఖ్యంగా సీత పాత్రలో నటించిన సాయిపల్లవి గురించి నెట్టింట ఎక్కువగా విమర్శలు వచ్చాయి. సాయిపల్లవి లుక్, ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ విషయంలో ఎంతోమంది.. విమర్శలు చేస్తున్నారు. మొదటినుంచి.. ఈ సినిమాలో సాయి పల్లవి పై నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా సీత పాత్రకు ఆమె గొంతు సరిపోలేదని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రణ్‌బీర్ కపూర్ పోషించిన శ్రీరాముడి పాత్రకు కూడా మిశ్రమ స్పందన వస్తోంది. ఇక ఈ సినిమాలో అత్యధిక ప్రశంసలు అందుకుంటున్న నటుడు మాత్రం.. యష్. రావణుడి పాత్రలో యష్ కనిపించిన తీరుపై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణ ప్రేక్షకుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు.. ఈ సినిమాకి హైవే ఎవరు అనగానే వెంటనే..యష్ పేరే చెబుతున్నారు.
కానీ సాయి పల్లవి పైన మాత్రమే.. ఈ సినిమా మొత్తానికి.. ఎక్కువగా నెగటివ్ ఇంప్రెషన్ పడింది అని చెప్పడంలో సందేహం లేదు. కొంతమంది ఆమెను ప్రశంసిస్తూ ఉంటే.. చాలామంది మాత్రం సీతగా ఆమె సెట్ అవ్వలేదు అని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి సాయి పల్లవి తన తర్వాత రాబోయే ఓం సినిమాస్ ద్వారా.. ఈ నెగిటివ్ అన్ని దాటుకొని మళ్ళీ తన సత్తా చూపిస్తుందేమో చూడాలి.
