రామాయణ : మరో దీపావళికే హనుమాన్ లీలలు?
ట్రైలర్‌లో ఎక్కువగా హనుమంతుడి ప్రస్థావన లేకపోవడంతో కొందరు సినీ ప్రేమికులు, ఆంజనేయుడిని ఆరాధించే వారు అసహనం వ్యక్తం చేశారు. రామాయణ పార్ట్ 1 లో హనుమంతుడి పాత్ర విషయమై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
By: Ramesh Palla | 2 Sept 2026 12:40 PM ISTబాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'రామాయణ' ఒకటి అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలన్నింటిలోకి ఖరీదైన మూవీగా రామాయణ గురించి చెప్పుకుంటున్నారు. రికార్డ్ స్థాయి బడ్జెట్‌తో రూపొందిన 'రామాయణ' సినిమా రికార్డ్‌లు బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు. సినిమాను రెండు లేదా మూడు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదటి పార్ట్‌లో సీతారాముల పరిచయం, రావణుడి పరిచయం ఉండబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్‌లో ఎక్కువగా హనుమంతుడి ప్రస్థావన లేకపోవడంతో కొందరు సినీ ప్రేమికులు, ఆంజనేయుడిని ఆరాధించే వారు అసహనం వ్యక్తం చేశారు. రామాయణ పార్ట్ 1 లో హనుమంతుడి పాత్ర విషయమై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
రామాయణంలో హనుమంతుడు ఎంట్రీ కోసం...
రామాయణంలో హనుమంతుడి ఎంట్రీ సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఉంటుంది. కొన్ని సినిమాల్లో బాల హనుమంతుడి గురించి చూపించినా ఈ సినిమాలో మాత్రం ఆ ఘట్టాలను చూపించే అవకాశం లేదు. కనుక ఈ సినిమాలో హనుమంతుడు మొదటి నుంచి కనిపించే అవకాశం లేదు. రామాయణ మొదటి పార్ట్‌లో రావణాసురుడు ఎప్పుడైతే సీతాదేవిని అపహరిస్తాడో అప్పటి వరకు చూపించబోతున్నారు. రాముడు, సీత విడి పోయే వరకు మొదటి పార్ట్ ఉంటుంది. అంటే మొదటి పార్ట్‌లో రాముడి జననం, బాల్యం, వివాహం చూపించబోతున్నారు. అలాగే దశరథుడు రాముడిని అరణ్యవాసం వెళ్లమని ఆజ్ఞాపించే సన్నివేశాలు ఉంటాయి. వీటన్నింటిలో హనుమంతుడి పాత్రతో అవసరం లేదు. కనుక ఈ దీపావళికి రాబోతున్న రామాయణ పార్ట్ 1 లో హనుమంతుడి లీలలు చూడబోవడం లేదని యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
రామాయణ పార్ట్ 1 విడుదల...
చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం 'రామాయణ' పార్ట్ 1 చివరి అయిదు లేదా పది నిమిషాల వ్యవధిలో హనుమంతుడి పాత్రను దర్శకుడు పరిచయం చేయబోతున్నాడు. సీతాదేవిని రావణుడు అపహరించిన వెంటనే హనుమంతుడు ఉలిక్కి పడుతాడు. ఏదో అనర్థం జరిగిందని, దీనికి తన శ్రీరామ చంద్రుడు ఎంతగా కుమిలి పోతున్నాడో కదా అని హనుమంతుడు ఆవేదన వ్యక్తం చేసే సీన్ ఉంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పార్ట్ పై హైప్ క్రియేట్ చేసే విధంగా హనుమంతుడి పాత్ర పరిచయం చాలా పవర్ ఫుల్‌గా, ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి సెకండ్ పార్ట్‌లోనే హనుమంతుడి పూర్తి స్థాయి లీలు చూడబోతున్నామని తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళికి రామాయణ మొదటి పార్ట్ రానుండగా, వచ్చే ఏడాది దీపావళికి రామాయణ రెండో పార్ట్ రాబోతుంది.
రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ముఖ్య పాత్రల్లో...
రామాయణలోని హనుమాన్‌ను చూడాలంటే వచ్చే ఏడాది దీపావళి వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రను సన్నీ డియోల్ పోషించిన విషయం తెల్సిందే. ఇప్పటికే మొదటి పార్ట్ షూటింగ్ పూర్తి కాగా, రెండో పార్ట్ కు సంబంధించిన షూటింగ్ సైతం కొంత మేరకు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటించిన ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అత్యంత పవర్ ఫుల్ పాత్ర అయిన రావణాసురుడు పాత్రను కన్నడ స్టార్, టాక్సిక్ హీరో యశ్ పోషించడం విశేషం. అందుకే ఈ సినిమా బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు కనీ విని ఎరుగని వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
