ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!
3 గంటల 15 నిమిషాల నిడివితో విడుదలైన ‘రామాయణం: పార్ట్ 1’ నుంచి తొలగించిన ఓ యాక్షన్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నేషనల్ వెర్షన్‌లో ఉన్న ఈ సన్నివేశం ఇండియన్ వెర్షన్‌లో లేదు. ఇందులో మూడు తోడేలు లాంటి జంతువుల నుంచి సీత, లక్ష్మణుడిని రాముడు బాణంతో కాపాడతాడు. ఇంత ఆసక్తికరమైన సీన్‌ను ఎందుకు తొలగించారంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
By: Priya Chowdhary Nuthalapti | 8 Nov 2026 4:39 PM ISTసాధారణంగా ఒక సినిమా మూడు గంటలు చూపివ్వాలి అంటే.. దర్శకుడు ప్రతిభ విపరీతంగానే ఉండాలి. మహానటి, రంగస్థలం లాంటి సినిమాలు మినహా ఈ మధ్యకాలం మూడు గంటలు దాటి మెప్పించిన సినిమాలు చాలా అరుదుగానే ఉన్నాయి.
అసలు విషయానికి వస్తే..నమిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన రామాయణం: పార్ట్ 1 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దాదాపు 3 గంటల 15 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమాలో చాలా అనవసరకు సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి తొలగించిన ఒక యాక్షన్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అసలు ఇంత లెంగ్త్ ఉన్న సినిమాలో కూడా ఈ సీన్ ఎందుకు తీసేశారు అంటూ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
ఈ యాక్షన్ సీన్ ఇంటర్నేషనల్ వెర్షన్‌లో ఉందగా.. ఇండియాలో విడుదలైన వెర్షన్‌లో మాత్రం లేదు డిలీటడ్ వీడియో బయటకు రావడంతో చాలామంది సినిమా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఆసక్తికరమైన సన్నివేశాన్ని ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సన్నివేశం శూర్పణఖ ఘట్టం తర్వాత వచ్చే భాగానికి సంబంధించినదిగా ఈ సీన్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో గాయపడిన లక్ష్మణుడు సీతమ్మతో కలిసి ఒక రాతి ప్రాంతం గుండా వెళ్తుంటాడు. అదే సమయంలో మూడు భయంకరమైన తోడేలు లాంటి జంతువులు వారిని వెంబడిస్తాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి సీత, లక్ష్మణుడు ఒక జలపాతం దగ్గర ఉన్న గుహలోకి వెళ్తారు.
ఆ సమయంలో రాముడు తన విల్లు, బాణంతో అక్కడికి వస్తాడు. ఒకే ఒక్క బాణంతో ఆ మూడు జంతువులను చంపి సీతమ్మను, లక్ష్మణుడిని కాపాడతాడు. ఈ సన్నివేశానికి కొనసాగింపు మాత్రం ఇండియన్ వెర్షన్‌లో ఉంది. అంటే ఆ సీన్‌కు ముందు వచ్చే యాక్షన్ ఘట్టాన్ని మాత్రమే కలిగించాడు. అయితే మూడు గంటల 15 నిమిషాల నిడివి ఉన్న సినిమాలో ఈ సన్నివేశాన్ని ఎందుకు తీసేశారన్నది ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
సినిమా నిడివి తగ్గించాలనుకుంటే మరేదైనా సన్నివేశాన్ని తొలగించి ఉండాల్సిందని, ఇలాంటి మంచి యాక్షన్ సీన్‌ను తీసేయడం ఎందుకని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
